ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అసలు విషయాలు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన మంగళవారం ఉదయం అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..  ఏపీ చేస్తున్న మంచిపనులు.. కేంద్రం, వైసీపీ చేస్తోన్న తప్పుడు పనులపై చర్చ జరగక్కుండానే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ జోన్ విషయంలో కేంద్రం చేసిన అన్యాయాలపై చర్చ జరగక్కుండానే డేటా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని బాబు ఆరోపించారు. ఓటమి భయంతో జగన్, కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే కుట్రలను ఛేదించాలని సీఎం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వృద్ధాప్య ఫించన్లు, పసుపు-కుంకుమ స్కీంపై చర్చ జరగకుండా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డేటా విషయంలో సిల్లీ వాదనలు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రాలకు పరిశ్రమలు రావని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

టీడీపీ డేటానే టీఆర్ఎస్ దొంగిలించే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. లబ్ధిదారుల జాబితా అనేది పబ్లిక్ డొమైన్ అని, ప్రతీ ఊర్లో గ్రామసభలో లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా మీకు బుద్దిరాదా..? : కేటీఆర్, వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు