దగ్గుబాటి ఎఫెక్ట్: పర్చూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరడానికి రంగం సిద్దమౌతోంది పర్చూరు నుండి హితేష్ వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఒంగోలు: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరడానికి రంగం సిద్దమౌతోంది పర్చూరు నుండి హితేష్ వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో పర్చూరు నియోజకరవర్గానికి చెందిన వైసీపీ నేతలు సోమవారం నాడు సమావేశమయ్యారు.వైసీపీ నేత రావికే టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆదివారం నాడు మాీజ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేష్‌ను తీసుకొని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు. హితేష్ వైసీపీతో నడవాలని నిర్ణయం తీసుకొన్నారని దగ్గుబాటి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో హితేష్ పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.అమెరికా పౌరసత్వం విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత పర్చూరు నియోజకవర్గానికి హితేష్ ను వైసీపీ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే సోమవారం నాడు వైసీపీకి చెందిన పర్చూరు నియోజకవర్గ నేతలు సమావేశమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌ను కలవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.వచ్చే ఎన్నికల్లో పర్చూరు వైసీపీ టిక్కెట్టు రావి రామనాథం బాబుకు కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పర్చూరు నియోజకవర్గం నుండి గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఇదే స్థానం నుండి తనయుడిని కూడ అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయాలని దగ్గుబాటి ప్లాన్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై దగ్గుబాటి కుట్ర: చంద్రబాబు
దగ్గుబాటి మారని పార్టీలు లేవు: తోడల్లుడిపై చంద్రబాబు వ్యాఖ్యలు
వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్
ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?
హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే
జగన్‌కు క్లీన్‌చీట్, దగ్గుబాటి లంచం పర్చూరు టికెట్: బుద్ధా వెంకన్న