హైదరాబాద్: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో ఆదివారం నాడు లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు.వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావును, ఆయన తనయుడు హితేష్ చెంచురామును లోటస్‌పాండ్‌కు తీసుకొచ్చారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావును, ఆయన తనయుడు హితేష్ చెంచురామును లోటస్‌పాండ్‌కు తీసుకొచ్చారు.ప్రకాశం జిల్లాలోని పర్చూరు నుండి  దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్‌ చెంచురామును రానున్న ఎన్నికల్లో పర్చూరు నుండి  బరిలోకి దింపాలని కుటుంబం భావిస్తోంది.

అయితే హితేష్ తల్లి దగ్గుబాటి పురంధేశ్వరీ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. రాజంపేట నుండి ఆమె ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం పురంధేశ్వరీ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు. 

అయితే పురంధేశ్వరీని కూడ వైసీపీలోకి రావాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2014  ఎన్నికల సమయంలోనే రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు హితేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు వీలుగానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌తో భేటీ అయ్యారని చెబుతున్నారు.

రానున్న ఎన్నికల్లో హితేష్‌ను పర్చూరు  నుండి బరిలోకి దింపేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా  దగ్గుబాటి వెంకటేశ్వరావుతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారు.

హితేష్ కు అమెరికా పౌరసత్వం ఉంది. అమెరికా పౌరసత్వాన్ని వదులుకొంటేనే ఇక్కడ పోటీ చేసేందుకు అవకాశం దక్కనుంది. ఈ కారణంగానే అమెరికా పౌరసత్వాన్ని వదులుకొనేందుకు వీలుగా హితేష్  కార్యక్రమాలను పూర్తి చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?

హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే

"