వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని హరిబాబు పార్టీ నాయకత్వానికి చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.దాంతో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్‌గా కాశీ విశ్వనాథరాజును పార్టీ నియమించింది. 

విశాఖపట్నం: ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో బిజెపి తరఫున పోటీ చేసిన హరిబాబు విశాఖపట్నం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా హరిబాబు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని విశాఖ నుంచి పోటీ దింపాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని హరిబాబు పార్టీ నాయకత్వానికి చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.దాంతో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్‌గా కాశీ విశ్వనాథరాజును పార్టీ నియమించింది. వచ్చె ఎన్నికల్లో తానే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. 

ఆ మేరకు ఆయన రాష్ట్ర పార్టీ నాయకునితో చర్చించి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు తన అనుచరులకు కన్వీనర్‌ బాధ్యతలు ఇప్పించుకున్నారు. అయితే పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు..

పార్టీ ఆమెను ఉత్తరాంధ్ర క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆమె విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అరకులోయ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. తరచూ విశాఖపట్నం వచ్చి ఇక్కడి నేతలతో చర్చిస్తున్నారు.