జగన్‌కు క్లీన్‌చీట్, దగ్గుబాటికి పర్చూరు టికెట్ లంచం: బుద్ధా వెంకన్న
చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడే హక్కు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు లేదన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్-దగ్గుబాటి భేటీపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..బీజేపీలో సభ్యురాలిగా ఉన్న పురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడరని, కానీ ఆమె భర్త మాత్రం పరిపానల బాలేదంటున్నారని ఎద్దేవా చేశారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పదవులు తప్పించి ప్రజాసేవపై దృష్టి లేదని బుద్దా ఆరోపించారు. చంద్రబాబు-భువనేశ్వరిలపై ఉన్న ఈర్ష్యతోనే ఈ పనులు చేస్తున్నారా అని వెంకన్న ప్రశ్నించారు. దగ్గుబాటి అన్నగారి కీర్తిని లోటస్‌పాండ్‌లో తాకట్టు పెట్టారని ఆయన దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా, వైఎస్ వల్ల ఇబ్బందులు పడ్డా తమ అధినేత సిద్ధాంతానికే కట్టుబడ్డారని వెంకన్న స్పష్టం చేశారు.
జగన్‌ని మంచోడు అనడానికి మీరు తీసుకున్న లంచం హితేశ్‌కి పర్చూరు ఎమ్మెల్యే టికెట్ అని బుద్దా ఆరోపించారు. నిజాయితీపరులు చెడ్డోళ్లు, అవినీతిపరులు మంచోళ్లా అని వెంకన్న ప్రశ్నించారు. 2014లో పురందేశ్వరి బీజేపీలో చేరి చంద్రబాబు సాయం కోరినప్పుడు ఆయన మంచోడయ్యాడా అని ప్రశ్నించారు.
దగ్గుబాటి మారని పార్టీలు లేవు: తోడల్లుడిపై చంద్రబాబు వ్యాఖ్యలు
వైసీపీలోకి హితేష్, బీజేపీలోనే పురంధేశ్వరీ: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
జగన్‌తో భేటీ: వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్
ఆ క్లియరెన్స్ వస్తే వైసీపీలోకి హితేష్: పురంధేశ్వరీ బీజేపీలోనే?
హరిబాబు దూరం: విశాఖ సీటు పురంధేశ్వరిదే