అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యిరెట్లు బెటర్ అంటూ ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే కేసీఆర్ ఎన్నో రెట్లు మంచి వారంటూ కితాబిచ్చారు. 

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం మాట్లాడిన అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభానాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి ప్రస్తావించారని దాంతో చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడి లేచారని విమర్శించారు. 

గోదావరి జలాల విషయంలో కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. గోదావరి జలాల తీసుకురావడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆయన చాలా మంచివారని అన్నారని టక్కున లేచిన చంద్రబాబు తాను మాట్లాడతానంటూ చేతులెత్తారని విమర్శించారు. 

తమ సభానాయకుడు కేసీఆర్ మంచివారే అన్నారు గానీ చంద్రబాబు నాయుడు చెడ్డవారు అని అనలేదన్నారు. చంద్రబాబు కంటే కేసీఆర్ వెయ్యిరెట్లు మంచి వారని తాను ఉద్ఘాటిస్తున్నానన్నారు. కేసీఆర్ మంచి వారంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. 

సభానాయకుడు చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వాలని చెప్పనియ్యకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో అది భావ్యం కాదన్నారు. చంద్రబాబు నాయుడు సభను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లాన్ వేసుకుని అసెంబ్లీకి వచ్చినట్లు ఉందన్నారు. నిత్యం సభలో చర్చ జరగకుండా అడ్డుతగలడం సరికాదని పద్దతి మార్చుకోవాలని చంద్రబాబు నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు.  

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణతో నదీ జలాల పంపకం: జగన్ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 4 టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

అసెంబ్లీలో నదీజలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ రగడ: రోడ్డెక్కిన చంద్రబాబు, నిరసన ర్యాలీ (వీడియో)

టీఆర్ఎస్ తో పొత్తుకోసం మీరు పాకులాడొచ్చు, మేం భవనాలు ఇస్తే తప్పా?: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

అసెంబ్లీలో గందరగోళం: సభ నుంచి టీడీపీ వాకౌట్, పారిపోయారన్న వైసీపీ