ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూశారు. శుక్రవారం ఉదయం కడప జిల్లా పులివెందులలోని స్వగృహంలో గుండెపోటుకు గురైన వివేకా కుప్పకూలిపోయారు.

కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోపు ఆయన మరణించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి స్వయానా సోదరుడైన వివేకానందరెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించారు. బాబాయ్ మరణం పట్ల జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 1950 ఆగష్టు 8న పులివెందులో జన్మించిన వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. 

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం