విజయవాడ: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా ప్రమాణ స్వీకారం చేశారు. వైయస్ అంటూ ఆయన నోటి వెంట వచ్చి ప్రతిధ్వని 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారాన్ని గుర్తుకు తెచ్చింది. 

ఇకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతికి వాచ్ పెట్టుకోవడం తక్కువ. అయితే ప్రమాణస్వీకారానికి మాత్రం వైయస్ జగన్ వాచీ పెట్టుకుని వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉన్న వాచీని తలపించేలా ఆ వాచీ ఉంది. 

అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన వాచీనే జగన్ పెట్టుకున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి వాచీ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన వైయస్  జగన్ తండ్రికి మించిన పాలన అందించాలని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ వార్తలు  కూడా చదవండి

సీఎం జగన్ నివాసానికి కేసీఆర్, స్టాలిన్: లంచ్ అనంతరం ఢిల్లీకి

ఉద్విగ్న క్షణాలు: సీఎం జగన్ భావోద్వేగం, విజయమ్మ కంటతడి

జగన్ ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్, చిరంజీవిలు డుమ్మా

స్టాలిన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన షర్మిల