విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డుమ్మాకొట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఆహ్వానించారు. 

ఆయనతోపాటు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరుకాలేదు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ ప్రతినిధిని సైతం పంపలేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్ కు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. ఇకపోతే జనసేన పార్టీ మిత్రపక్షాలు అయిన సీపీఎం, సీపీఐ నేతలు మధు, కె.రామకృష్ణలు హాజరయ్యారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు హాజరయ్యారు.