అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అభినందనలు తెలిపేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకున్నారు డీఎంకే చీఫ్ స్టాలిన్. 

ఇందిరాగాంధీ స్టేడియం చేరుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ ను వైయస్ షర్మిల పరిచయం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒక్కొక్కరుగా పరిచయం చేశారు. తొలుత తల్లి వైయస్ విజయమ్మను పరిచయం చేశారు. అనంతరం వైయస్ భారతీరెడ్డిని పరిచయం చేశారు. స్టాలిన్ వైయస్ జగన్ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకుని వారిని పరిచయం చేసుకున్నారు.