అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ లు చేరుకున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్ తోపాటు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. 

సీఎం జగన్ తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ లు లంచ్ చేస్తారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్ లు ఢిల్లీకి పయనం కానున్నారు. మరోవైపు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలతోపాటు పలువురు కీలక నేతలు జగన్ నివాసంలో లంచ్ చేయనున్నారు. 


తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం 7 గంటలకు ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు.   

ఈ వార్తలు కూడా చదవండి

ఉద్విగ్న క్షణాలు: సీఎం జగన్ భావోద్వేగం, విజయమ్మ కంటతడి

జగన్ ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్, చిరంజీవిలు డుమ్మా

స్టాలిన్ కు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన షర్మిల