సుబ్బయ్య టీడీపి వ్యక్తి: కార్డు విడుదల చేసిన వైసిపి నేత

YCP counters China Rajappa's statement
Highlights

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సుబ్బయ్య వైఎస్సార్ కాంగ్రెసు కార్యకర్త అంటూ డిప్యూటీ సిఎం చినరాజప్ప చేసిన ఆరోపణకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కౌంటర్ ఇచ్చారు.

గుంటూరు: దాచేపల్లి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన సుబ్బయ్య వైఎస్సార్ కాంగ్రెసు కార్యకర్త అంటూ డిప్యూటీ సిఎం చినరాజప్ప చేసిన ఆరోపణకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కౌంటర్ ఇచ్చారు.

దాచేపల్లి బాలికపై అత్యాచారం ఘటనను తాము రాజకీయం చేయదలుచుకోలేదని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. అయితే టీడిపి ప్రభుత్వమే తమ పా్రటీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 

దాచేపల్లి ఘటన విషయంలో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ మంత్రులు, టిడీపి ఎమ్మెల్యేలు నిందితుడు వైసిపికి చెందిన వ్యక్తి ్ంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిజానికి సుబ్బయ్య టీడీపికి చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు. 

అందువల్లనే సుబ్బయ్యకు టీడీపి ఎమ్మెల్యే ఇల్లు మంజూరు చేయించారని, ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని, సమస్యను సమస్యమాదిరిగానే చూైడాలని ఆయన అన్నారు. 

loader