విజయవాడ: విజయవాడ ఎంపీ, టీడీపీ నేత  కేశినేని నాని ఫేస్‌బుక్ వేదికగా  తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ వేదికగా కేశినేని నాని చేస్తున్నవ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

 

కృష్ణా జిల్లాలోని విజయవాడ ఎంపీ సెగ్మెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓటమి పాలైనప్పటికీ ఎంపీగా కేశినేని నాని విజయం సాధించిన విషయం తెలిసిందే.  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఫేస్‌బుక్‌లో కేశినేని నాని పోస్టులు పెడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన కొడాలి నాని‌కి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.   ఈ విషయమై కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు.కొడాలి నాని  తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని  తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు.

మాజీ మంత్రి దేవినేని ఉమాకు, విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నాయి. ఈ విబేధాలతో పాటు  పార్లమెంట్‌లో పార్టీ పదవుల కేటాయింపుల విషయంలో  కూడ కేశినేని నాని చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

దీంతో పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా చంద్రబాబుకు ఫేస్‌బుక్‌ ద్వారా ఇటీవలనే విన్నవించారు. ఆ తర్వాత  అదే రోజున బాబు పిలిపించి నానితో గంటకు పైగా చర్చించారు.

చంద్రబాబునాయుడు చర్చించిన మరునాడే పోరాడితే పోయేదేమీ లేదు  బానిస సంకెళ్లు తప్ప అంటూ కామెంట్ పెట్టాడు.ఆ తర్వాత ఇవాళ కొడాలి నానిని ఉద్దేశించి కేశినేని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

టీడీపీ తీరుపై కేశినేని ఆసక్తికర వ్యాఖ్య: ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

అలక: ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు ఫోన్

కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

అసంతృప్తి: కేశినేని నానితో గల్లా జయదేవ్ భేటీ