అమరావతి:  విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  బుధవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టు నాని ప్రకటించారు. పార్టీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో చంద్రబాబునాయుడు నానికి ఫోన్ చేశారు.

పార్టీ పదవుల ఎంపిక విషయంలో నాయకత్వం అనుసరించిన తీరుతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన నేతల మధ్య కూడ విబేధాల కారణంగా నాని అలిగారు.ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని కేశినేని నాని పార్లమెంట్‌లో  టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

బుధవారం నాడు మధ్యాహ్నం గల్లా జయదేవ్  కూడ కేశినేనితో భేటీ అయ్యారు. అయితే నాని మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు.  దీంతో చంద్రబాబునాయుడు కేశినేని నానికి ఫోన్ చేశారు. 

బుధవారం నాడు సాయంత్రం తనను కలవాలని నానికి బాబు సూచించారు. అయితే చంద్రబాబునాయుడు ఫోన్‌ తో నాని మెత్తబడతారా....బాబుతో భేటీ అవుతారా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు

కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

అసంతృప్తి: కేశినేని నానితో గల్లా జయదేవ్ భేటీ