Asianet News TeluguAsianet News Telugu

అసంతృప్తి: కేశినేని నానితో గల్లా జయదేవ్ భేటీ

తనను లోక్‌సభలో విప్ పదవిలో నియమించడం పట్ల అలకబూనిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనిని హైకమాండ్ బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌.. విజయవాడలో నానితో భేటీ అయ్యారు. 

tdp parliamentary party leader galla jayadev meets vijayawada mp kesineni nani
Author
Vijayawada, First Published Jun 5, 2019, 1:10 PM IST

తనను లోక్‌సభలో విప్ పదవిలో నియమించడం పట్ల అలకబూనిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనిని హైకమాండ్ బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌.. విజయవాడలో నానితో భేటీ అయ్యారు.

అనంతరం కేశినేని మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రకటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. విజయవాడ ఎంపీ కంటే తనకు మరో పెద్ద పదవి లేదని వ్యాఖ్యానించారు.

విప్ అంశాన్ని బూతద్దంలో చూడొద్దని.. తాను బెజవాడ ఎంపీగానే లోక్‌సభలో అవిశ్వాసం పెట్టానని గుర్తు చేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని... విభజన హామీలపై విజయవాడ ఎంపీగానే పోరాడానని స్పష్టం చేశారు.

కాగా.. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్‌దేవ్‌ను , అలాగే లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడిని, పార్టీ విప్‌గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు. అయితే దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని.. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాంటూ సూచించడం పార్టీలో కలకలం రేపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios