విజయవాడ: పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని గురువారం నాడు ఫేస్‌బుక్‌లో మరో కామెంట్ పెట్టాడు. పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అంటూ ఆయన కామెంట్ పెట్టాడు.

పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవితో పాటు  కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో  ఈ పదవిని తీసుకోవడాని నాని విముఖత చూపినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

ఈ పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని, గల్లా జయదేవ్ బుధవారం నాడు సాయంత్ర చంద్రబాబునాయుడుతో గంటకుపైగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో పాటు... తన అసంతృప్తిని చంద్రబాబుకు  నాని వివరించారు.

చంద్రబాబుతో భేటీ తర్వాత  వివాదం సమసిపోయిందని అంతా భావించారు. కానీ గురువారం నాడు ఉదయం పూట కేశినేని నాని మరో పోస్ట్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అని శ్రీశ్రీ కొటేషన్‌గా తన ఫేస్‌బుక్‌లో రాశాడు. అయితే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప... అనే కొటేషన్  మార్కిస్ట్ సిద్ధాంత కర్త కారల్ మార్క్స్‌ది. అయితే  శ్రీశ్రీ ఆ మాటలు అన్నట్టుగా కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అలక: ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు ఫోన్

కేశినేని నాని అలక వెనుక పెద్ద కథే....

అసంతృప్తి: కేశినేని నానితో గల్లా జయదేవ్ భేటీ