కడప జిల్లా రాజంపేట టిక్కెట్టు కోసం  టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ కూడ రాజంపేట టిక్కెట్టు ఇవ్వాలని  కోరుతున్నారు

అమరావతి: కడప జిల్లా రాజంపేట టిక్కెట్టు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబును ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ కూడ రాజంపేట టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు.

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీ నుండి వైసీపీలో చేరారు. ఈ నెల 22వ తేదీన చంద్రబాబునాయుడు సమక్షంలో రాజంపేట టీడీపీ నేతల సమావేశం ఉంది. కానీ, అదే రోజున మేడా మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

అయితే ఈ సమావేశానికి ముందు రోజునే టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ను రెడ్‌బస్ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఉన్న చరణ్‌రాజు భేటీ అయ్యారు. రాజంపేట టిక్కెట్టు ఇవ్వాలని సీఎం రమేష్‌ను ఆయన కోరారు. 

ఇదిలా ఉంటే ఆదివారం నాడు తానా అధ్యక్షుడు వేమన సతీష్ రాజంపేట టిక్కెట్టు తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కోరారు. అయితే ఈ స్థానంలో టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలని సతీష్‌ను బాబు కోరారు. సరైన సమయంలో అందరికీ సరైన అవకాశాలు వస్తాయని బాబు చెప్పారు. 

మరోవైపు మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ఈ నెల 31వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మేడా ఎఫెక్ట్: తాడోపేడో అంటున్న అమర్‌నాథ్ రెడ్డి

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు