రాజంపేట: కడప జిల్లా రాజంపేట వైసీపీలో చిచ్చు రేగింది. టీడీపీ నుండి వైసీపీలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి వర్గీయులకు మింగుడుపడడం లేదు. ఈ నెల 31వ తేదీన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆకేపాటి  అమర్‌నాథ్  రెడ్డి ప్రకటించారు.

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే  మేడా మల్లిఖార్జున్ రెడ్డి  టీడీపీని వీడీ ఈ నెట 22వ తేదీన జగన్ సమక్షంలో  వైసీపీలో చేరారు. మేడా మల్లిఖార్జున్ రెడ్డి  వైసీపీలో చేరడాన్ని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో అమర్‌నాథ్ రెడ్డికే రాజంపేట వైసీపీ టిక్కెట్టును జగన్ కేటాయించనున్నారని నాయకత్వం నుండి  హామీ లభించిందని మల్లిఖార్జున్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు.

ఈ తరుణంలో  రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. శనివారం అర్ధరాత్రి నుండి అమర్‌నాథ్ రెడ్డి  అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పార్టీ కోసం, జగన్‌ కోసం వెన్నంటి ఉన్న అమర్‌నాథ్ రెడ్డిని కాదని మల్లిఖార్జున్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించనున్నట్టు ఆయన వర్గీయులు ప్రకటించారు. మల్లిఖార్జున్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడాన్ని  వ్యతిరేకించాలని వారంతా భావిస్తున్నారు. 

మరోవైపు అమర్‌నాథ్ రెడ్డి ఈ నెల 31వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. మల్లిఖార్జున్ రెడ్డికే జగన్ టిక్కెట్టును ఖరారు చేస్తే ఏం చేయాలనే దానిపై అమర్‌నాథ్ రెడ్డి  తన వర్గీయులతో చర్చించారు.

డబ్బులు లేవనే కారణంగానే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోందని అమర్‌నాథ్ రెడ్డి వర్గీయులు  ఆరోపణలు చేస్తున్నారు. అవసరమైతే తాము చందాలు పోగేసుకొని  అమర్‌నాథ్ రెడ్డిని బరిలోకి దింపుతామని ఆయన అనుచరులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజంపేట టిక్కెట్టు: బాబును కలిసిన తానా అధ్యక్షుడు వేమన సతీష్

అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు

అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

బాబుకు షాక్: ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ వైపు చూపు