టీటీడీ ముద్రించిన భక్తి గీతానందలహరి పుస్తకంపై విచారణకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విచారణకు ఆదేశించారు. వెబ్‌సైట్‌లో అన్యమత సమాచారం ఉన్నట్లు గుర్తించామని.. సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించామని ఈవో స్పష్టం చేశారు.

పింక్ డైమండ్ లేదని గతంలోనే చెప్పామని.. సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో 20 అంశాలపై చర్చించామని అనిల్ తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనంపై ఫైనాన్షియల్ కమిటీని నివేదిక కోరామని, ఉద్యోగుల కోసం రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.

వచ్చే ఏడాది నుంచి టీటీడీ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా రద్దు చేస్తున్నామని, ఉత్తీర్ణత ఆధారంగానే విద్యార్ధులకు సీట్లను కేటాయిస్తామని సింఘాల్ పేర్కొన్నారు.

టీటీడీ కాలేజీలు, హాస్టళ్ల కోసం రూ.100 కోట్లు కేటాయించామని, నిబంధనల ప్రకారం బర్డ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ జగదీశ్‌ పదవికాలం పొడిగింపునకు అవకాశం లేదని అనిల్ స్పష్టం చేశారు.

త్వరలోనే కొత్త బర్డ్ డైరెక్టర్ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. టీటీడీ పరమైన 183 ఎకరాల భూమి కేసులో కేవీయట్ దాఖలు చేస్తామని.. అలాగే భూములపై కమిటీని వేసి సర్వే జరిపించాలని నిర్ణయించినట్లుగా సింఘాల్ పేర్కొన్నారు. 

అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గింపు: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బోర్డు నుంచి తొలగించడం బాధేసింది, నా నిజాయితీని జగన్ గుర్తించారు: శేఖర్ రెడ్డి

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

టీటీడీ ప్రత్యేక అహ్వానితుల్లో శేఖర్ రెడ్డి: జగన్ సెల్ఫ్ గోల్

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు: ఉత్తర్వులు జారీ

28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణనాతీతం :టీటీడీపై ఐవైఆర్

టీటీడీ బోర్డు మెంబర్ రేసులో లేను: స్పష్టం చేసిన ద్వారంపూడి

టీటీడీ పాలకమండలిపై జగన్ కసరత్తు: పరిశీలనలో కేసీఆర్ మిత్రుడు