Asianet News TeluguAsianet News Telugu

నీలి చిత్రాలు చూపిస్తూ తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు లైంగిక వేధింపులు..!

ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారిపై ముగ్గురు బాలురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోర్న్ వీడియోలు చూడడానికి అలవాటు పడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సమాచారం. 

Three sexually assaulted nine-year-old girl by showing porn videos in andhrapradesh
Author
First Published Sep 2, 2022, 8:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ : నీలి చిత్రాలు చూడటానికి అలవాటు పడిన ముగ్గురు బాలురు.. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంది. వారికి తొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఆ బాలిక అదే గ్రామంలో చదువుకుంటోంది. ఇంటి యజమాని కుమారుడు, ఆ పక్కనే ఉండే మరో ఇద్దరు బాలురు ఫోన్లో నీలి చిత్రాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆ మైకంలో చిన్నారిని ఇంటిపైకి తీసుకు వెళ్ళి 15 రోజులుగా నీలిచిత్రాలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.  

అయితే, ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు. మనస్తాపం చెందిన చిన్నారి ముక్తసరిగా అయిపోయింది. అయితే, ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరాతీసారు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. నూజివీడు గ్రామీణ సిఐ అంకబాబు అగిరిపల్లి ఎస్సై చంటిబాబు ఘటనతో విచారిస్తున్నారు. మరోవైపు ఇరు వర్గాల పెద్దలు రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

విషాదం : చలాకీతనంతో సీఎం దృష్టిని ఆకర్షించిన చిన్నారి.. అంతలోనే డెంగీతో మృతి..

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు గువాహటిలో జరిగింది. ‘కుటుంబం, సామాజిక పరిస్థితుల మార్గదర్శనం బాగుంటే నేడు నలుగురు పిల్లల జీవితాలను కాపాడి ఉండేవి. వీరిలో ఒకరు ప్రాణం కోల్పోతే మిగతా ముగ్గురు జీవితాలు కోల్పోయారు. ఇలా మన చుట్టూ మరెవరికైనా కూడా జరగొచ్చు.  సమాజంలో నైతిక విలువలు పడిపోతే బాధ్యత మనదే అవుతుంది.’ అని అస్సాంలోని నగావ్ జిల్లా ఎస్పీ ఆనంద్ మిశ్రా వ్యక్తం చేసిన ఆవేదన ఎన్నో కుటుంబాలకు ఓ హెచ్చరిక.

ఈ జిల్లాలోని కలియబర్ పట్టణ పరిధి మిస్సా గ్రామాల్లో 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలలు.. ఆరేళ్ల బాలిక ఉసురు తీసిన సంఘటన వివరాలు వెల్లడిస్తూ ఎస్పీ ఈ వ్యాఖ్యలు చేశారు. పోర్న్ చూసేందుకు అలవాటు పడ్డ ముగ్గురు చిన్నారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తమతో కలిసి ఆ వీడియోలు చూసేందుకు నిరాకరించిందని ఆరేళ్ల బాలికను అమానుషంగా హత్య చేశారు. నిందితుల్లో ఇద్దరి వయసు పదకొండేళ్లు,  మరొకరి వయసు ఎనిమిదేళ్లు. 24 గంటల్లో ఈ కేసును ఛేదించిన పోలీసులు పూర్తి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

నేరాన్ని దాచేందుకు యత్నించిన కారణంగా..  నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్టు చేశారు. మిస్సాలోని ఒక క్వారీ వద్ద మరుగుదొడ్డిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం క్వారీ వద్దకు బాలికను రమ్మని పిలిచిన ముగ్గురు బాలలు తమతో పాటు మొబైల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్స్ చూడాలని ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో వారు ఆగ్రహానికి గురై అక్కడున్న రాళ్లతో ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.  ముగ్గురు బాలల్లో ఒకరు ఆన్ లైన్ క్లాసెస్ హాజరయ్యేందుకు అతని తండ్రి స్మార్ట్ ఫోన్ ఇవ్వగా.. మిగతా ఇద్దరితో కలిసి అందులో నీలిచిత్రాలు చూడడానికి అతను అలవాటు పడినట్లు తెలిసింది. నిందితుల చేతుల్లో ఉన్న తండ్రి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో అన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయని తెలిపారు

Follow Us:
Download App:
  • android
  • ios