Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర' సినిమా: కల్పిత సంఘటన, బ్రీఫ్డ్‌మీ డైలాగ్

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆ  పార్టీ గురించి 'యాత్ర' సినిమాలో పరోక్షంగా ప్రస్తావించారు. కోవర్ట్ ఆపరేషన్‌కు బ్రీఫ్డ్‌మీ అంటూ  ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను  వ్యంగ్యంగా తెరకెక్కించారు

tdp role in yatra cinema
Author
Amaravathi, First Published Feb 8, 2019, 5:40 PM IST


హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఆ  పార్టీ గురించి 'యాత్ర' సినిమాలో పరోక్షంగా ప్రస్తావించారు. కోవర్ట్ ఆపరేషన్‌కు బ్రీఫ్డ్‌మీ అంటూ  ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను  వ్యంగ్యంగా తెరకెక్కించారు. ఈ సన్నివేశాల్లో బాబు పేరును కానీ, ఆ పార్టీని కానీ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, ఈ సన్నివేశాలను చూస్తే దర్శకుడు ఎవరి గురించి చెప్పాలనుకొన్నాడో ప్రేక్షకుడికి అర్ధం కానుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ పాదయాత్రను చేశారు. పాదయాత్ర చేసే సమయంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది.

టీడీపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌ పార్టీకి లేదనే  అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. వైఎస్ఆర్ కూడ  ఒకానొక దశలో రాజకీయాల నుండి దూరంగా వెళ్లిపోవాలా అనే అభిప్రాయంతో ఉన్నట్టుగా సినిమాలో చూపారు.

టీడీపీని మనదేశం పార్టీ పేరుతో యాత్ర సినిమాలో చూపించారు. వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కదిరి టిక్కెట్టు కోసం అంతకుముందే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఆశించి వైఎస్ఆర్ తన మనిషి కోసం అడ్డు చెప్పడంతో మన దేశం పార్టీ నేతల వద్దకు వస్తారు.

వైఎస్ఆర్‌తోనే ఉంటున్నట్టుగా నటిస్తూ కోవర్ట్ ఆపరేషన్ చేయాలని మన దేశం నేతలు ప్లాన్‌ను  వెంకట్రావుకు చెప్పినట్టుగా  సినిమాలో చూపారు. ఈ సమయంలోనే తమ పార్టీ చీఫ్ మీతో మాట్లాడుతారంటూ ఫోన్లో మాట్లాడిస్తారు. బ్రీఫ్డ్‌డ్ మీ అంటూ  ఆయన మాట్లాడిన మాటలు పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్లు వేసినట్టుగా సినిమాలో చూపించారు.

పాదయాత్ర సాగుతున్న సమయంలో ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్‌పై మన దేశం నేతల మధ్య చర్చల సమయంలో రంగారావు అనే నేత మాత్రం వైఎస్ఆర్ యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పగా.. మిగిలిన నేతలు మాత్రం కొట్టిపారేసినట్టుగా చూపించారు.

కొత్త కొత్త పథకాలను తీసుకొస్తే  జనం అన్నీ మర్చిపోతారని  మన దేశం పార్టీ నేత ఒకరు చెప్పే కామెంట్స్  కూడ సినిమాలో ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు కూడ వెళ్లొద్దని మన దేశానికి చెందిన నేత ఒకరు  వారించినట్టుగా యాత్ర సినిమాలో చూపించారు.

రైతులకు ఉచిత విద్యుత్ ను ఇస్తానని వైఎస్ఆర్ పాదయాత్రలో ప్రకటిస్తే ఆ సభకు వచ్చిన పచ్చచొక్కాలు వేసుకొని వచ్చిన ఓ కార్యకర్త వైఎస్ఆర్ కు జై కొడతారు. అయితే ఆ పార్టీకి చెందిన మరో కార్యకర్త అతడిని వారిస్తాడు. వైఎస్ఆర్ మన పార్టీ నేత కాదని చెబుతారు. అయితే ముందు ఇది మా గ్రామం... నేను రైతును అంటూ ఆ కార్యకర్త పచ్చ చొక్కా విప్పి వేయడాన్ని సినిమాలో చూపించారు.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమాలో ట్విస్ట్: చివర్లో వైఎస్ జగన్ స్పీచ్

'యాత్ర' సినిమా: గ్రూపు రాజకీయాల నుండి ప్రజా నేతగా వైఎస్

'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక

'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

 

Follow Us:
Download App:
  • android
  • ios