Asianet News TeluguAsianet News Telugu

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

తనను నమ్ముకొన్నవాళ్లకు వైఎస్ఆర్ జీవితాంతం అండగా నిలిచినట్టుగా  యాత్ర సినిమాలో దర్శకుడు చూపించారు.  రాజకీయాల్లో ఉన్న కాలంలో తనకు అండగా నిలిచినవారిని ఆదుకొనే ప్రయత్నం చేసినట్టుగా ఈ సినిమాలో  దృశ్యాలు ఉన్నాయి.

ysr life history in yatra cinema
Author
Amaravathi, First Published Feb 8, 2019, 2:17 PM IST


హైదరాబాద్: తనను నమ్ముకొన్నవాళ్లకు వైఎస్ఆర్ జీవితాంతం అండగా నిలిచినట్టుగా  యాత్ర సినిమాలో దర్శకుడు చూపించారు.  రాజకీయాల్లో ఉన్న కాలంలో తనకు అండగా నిలిచినవారిని ఆదుకొనే ప్రయత్నం చేసినట్టుగా ఈ సినిమాలో  దృశ్యాలు ఉన్నాయి.

వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఉన్న కాలంలో పాదయాత్రను ప్రారంభించారు.  పాదయాత్ర ప్రారంభించే సమయంలో  అప్పటివరకు ఆయనతోనే ఉన్న నారాయణప్ప అనే అనుచరుడి భార్య వైఎస్ఆర్‌తో వెళ్లకూడదని కోరుతోంది.

వైఎస్ఆర్‌ను నమ్ముకోవడం కంటే ఎకరం భూమిని నమ్ముకొంటే భోజనం పెడుతోందని ఆమె చెప్పే సన్నివేశాలను సినిమాలో చూపించారు.అయితే తాను ఉదయం పూట నుండి తిరిగి మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి కాళ్లు కడుక్కో భోజనం చేయాలని వైఎస్ఆర్‌ తనకు చెబుతాడన్నారు.  

వేరేవాళ్లతో ఉదయం నుండి పనిచేయించుకొని భోజనం టైమ్‌కు ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని కోరుతారని నారాయణప్ప పాత్రధారి చెప్పే సన్నివేశాన్ని సినిమాలో చూపించారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన  రాష్ట్ర నాయకత్వం పార్టీ అభ్యర్థుల జాబితాను తీసుకొని వైఎస్ఆర్ వద్దకు వస్తారు. అయితే ఆ సమయంలో వైఎస్ఆర్ తాను తయారు చేసిన జాబితాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి  ఇస్తారు. ఈ అభ్యర్థులను తాను గెలిపిస్తాననే  కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి హామీ ఇస్తారు.

అదే సమయంలో  భోజనం సమయం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలను కూడ భోజనానికి రావాలని  వైఎస్ఆర్ ఆహ్వానిస్తారు. వైఎస్ఆర్ తన అనుచరుడు నారాయణప్పను కూడ తనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో కూర్చోబెట్టుకొని భోజనం చేయిస్తాడు.

నారాయణప్ప భోజనం చేస్తూ భావోద్వేగానికి గురైనట్టుగా ఈ సినిమాలో చూపిస్తారు.  కేవీపీని తాను ఒక్కటేనని కూడ పలు సందర్భాల్లో వైఎస్ఆర్ చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

రాజకీయంగా తనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడ సుచరితా తన సహాయం కోరి వస్తే వైఎస్ఆర్ ఆ కుటుంబానికి అండగా నిలిచినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

మరో వైపు అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ టిక్కెట్టును తన మనిషిగా ముద్రపడిన నారాయణరెడ్డికే టిక్కెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి  వైఎస్ఆర్ తేల్చి చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చెందిన ప్రతినిధులు కదిరి సీటు విషయంలో  వెంకట్రావు అనే పారిశ్రామికవేత్తకు టిక్కెట్టు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెబుతారు.  

కానీ, ఈ స్థానం నుండి  గతంలో రెండు దఫాలు నారాయణరెడ్డి పోటీ చేశారు.. ఆయన అభిప్రాయం గురించి తెలుసుకోవాలంటాడు. అదే సమయంలో తనను కలిసేందుకు నారాయణరెడ్డి వస్తే తన సీట్లో నారాయణరెడ్డిని కూర్చోబెట్టి ఆయనకు తాను ఇచ్చే గౌరవాన్ని ఈ సినిమాలో చూపించారు.

పాదయాత్ర సాగుతున్న సమయంలోనే నారాయణరెడ్డి వచ్చి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని వైఎస్ఆర్‌కు చెబుతారు. అయితే అదే సమయంలో ఈ సీటు కోసం గతంలో వైఎస్ఆర్ వద్దకు పార్టీ నాయకత్వంతో కలిసి వచ్చిన వెంకట్రావుకు టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరనున్నట్టు వైఎస్ఆర్ చెప్పినట్టుగా సినిమాలో చూపించారు.

మరోవైపు  వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థి పార్టీకి సహకరిస్తున్నట్టుగా ఈ సినిమాలో చూపించారు.కదిరి టిక్కెట్టును వెంకట్రావుకు ఇవ్వాలని వైఎస్ఆర్‌ సూచించడంపై  ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా సినిమాలో చూపించారు.

సంబంధిత వార్తలు

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

Follow Us:
Download App:
  • android
  • ios