హైదరాబాద్: గౌరు కుటుంబానికి వైఎస్ఆర్ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో  యాత్ర సినిమాలో చూపించారు. రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసినా కూడ సహాయం కోసం వచ్చిన వారికి  వైఎస్ఆర్ ఏ రకంగా అండగా నిలిచారనే విషయాన్ని దర్శకుడు సినిమాలో తెరకెక్కించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గౌరు వెంకట్ రెడ్డిపై  కేసులు నమోదు కావడంతో ఆయన రిమాండ్‌కు వెళ్తారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ఆర్ జైలులో ఉన్న గౌరు వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ విషయమై అప్పట్లో  రాజకీయంగా దుమారం రేగింది.

అయితే ఈ విషయాన్ని యాత్ర సినిమాలో  తెరకెక్కించారు. గౌరు వెంకట్ రెడ్డి, చరితారెడ్డి పాత్రలను పోలిన సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారు.పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలకు వెళ్లాల్సిన సమయంలో  జైలులో ఉన్న గౌరు వెంకట్‌రెడ్డిని కలిసిన తర్వాతే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలకు వెళ్లినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

రాజకీయంగా తనకు వ్యతిరేకంగా పనిచేసిన రాంరెడి కూతురు సుచరిత తనకు సహాయం చేయాలని  వైఎస్ఆర్‌ను కోరుతోంది. ఇదే సీన్‌తో యాత్ర సినిమా ప్రారంభం కానుంది. భయం భయంగానే  సుచరిత వైఎస్ఆర్ దగ్గరకు వస్తోంది.

తమ వాళ్లను ఊళ్లోకి రాకుండా భయపెడుతున్నారని సుచరిత వైఎస్ఆర్‌కు చెబుతోంది. అయితే తాను ఉన్నానని వైఎస్ఆర్ ఆమెకు అభయం ఇస్తాడు. ఉప ఎన్నికల్లో  పోటీ చేయాలని  ఆమెకు సూచిస్తాడు. నామినేషన్‌కు అన్ని సిద్దం చేసుకోవాలని ఆమెకు చెప్పినట్టుగా ఈ సినిమాలో చూపించారు. 

అయితే ఆ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ సుబ్బారెడ్డి అనే వ్యక్తిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. సుబ్బారెడ్డికే మద్దతివ్వాలని వైఎస్ఆర్‌ను పార్టీ నాయకత్వం తరపున వచ్చిన ప్రతినిధి కోరుతారు. కానీ,  వైఎస్ఆర్ మాత్రం అప్పటికే తాను సుచరితకు మద్దతిస్తున్నట్టుగా మాట ఇచ్చానని... ఆ మాటను వెనక్కు తీసుకోలేనని చెప్పినట్టుగా సినిమాలో చూపించారు.

సుచరితతో వైఎస్ఆర్ నామినేషన్ దాఖలు చేయించినట్టుగా  సినిమాలో చూపించారు.  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొన్న సుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయం దాటిన తర్వాత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి  మీరు చెప్పిన టైమ్‌కే వచ్చానా.. అన్నా అంటూ ప్రశ్నించినట్టుగా సినిమాలో చూపించారు.

ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో  క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యేందుకు వెళ్తూ జైలులో ఉన్న వెంకట్ రెడ్డిని  వైఎస్ఆర్ పరామర్శించినట్టుగా సినిమాలో చూపించారు.

సుచరితను ఆమె ఇంటి వద్దకు పంపేందుకు తన మనిషిని ఇచ్చి వైఎస్ఆర్ పంపుతారు. అయితే ప్రత్యర్థులు ఆమెపై దాడికి ప్రయత్నించేందుకు కాపు కాసినట్టుగా సినిమాలో చూపిస్తారు.  అయితే వైఎస్ఆర్‌కు చెందిన జెండాను సుచరిత వెంట జీపులో వచ్చిన మనిషి చూపిస్తారు.ఈ జెండాను చూసిన సుచరిత ప్రత్యర్థులు ఆమె వాహనానికి దారి ఇచ్చినట్టుగా ఈ సినిమాలో చూపించారు.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్