Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక

ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు పాదయాత్రలో ప్రజల నుండి  తెలుసుకొన్న సమస్యలే ప్రధాన కారణమని యాత్ర సినిమాలో చూపారు. 
 

what was the reason behind ysr welfare schemes
Author
Amaravathi, First Published Feb 8, 2019, 3:40 PM IST


హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు పాదయాత్రలో ప్రజల నుండి  తెలుసుకొన్న సమస్యలే ప్రధాన కారణమని యాత్ర సినిమాలో చూపారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  2009లో కూడ రెండో దఫా కూడ ఆయన సీఎం అయ్యారు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా  కావడానికి  వైఎస్ఆర్ నిర్వహించిన పాదయాత్రే  కీలకమైంది.

ముఖ్యమంత్రిగా  తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో అనేక సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకొన్న వైఎస్ఆర్  ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.

పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ గ్రామాల్లో  పర్యటించిన సమయంలో ప్రజలతో మాట్లాడిన సమయంలో పెన్షన్ల విషయాన్ని ఆయన దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. గ్రామంలో కేవలం 10 మందికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్పినట్టుగా సినిమాలో చూపారు.

పెన్షన్ తీసుకొంటున్న వృద్దులు చనిపోతేనే కొత్తవారికి పెన్షన్ ఇస్తున్నట్టుగా కొందరు వృద్దులు చెప్పిన డైలాగ్‌లు సినిమాలో ఉన్నాయి. వృద్దుల కోసం ఏమైనా చేయాలని  ఓ మహిళ వైఎస్‌ను కోరుతోంది.

దీంతో వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌ను రూ.75 నుండి రూ250లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ ఓ మార్కెట్‌ యార్డుకు చేరుకొంటారు. 

టమాట రైతు తాను పండించిన పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు వస్తారు. అయితే కిలో టమాటను ఒక్క రూపాయికే  కొనుగోలు చేస్తానని వ్యాపారి చెబుతాడు. ఈ టమాటను ఆటోలో తీసుకొచ్చిన అద్దె కూడ దీంతో రాని పరిస్థితి ఉంటుంది. దీంతో మార్కెట్లోనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సినిమాలో చూపారు.

రైతు ఆత్మహత్యకు పాల్పడే ముందు వైఎస్ఆర్ తో తమ ధైన్యస్థితిపై వైఎస్ఆర్‌తో మొరపెట్టుకొంటాడు. ఈ సందర్భంగా రైతులు ఏం కావాలో తెలుసుకొంటాడు.  ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతును పరామర్శించి అతడిని ఓదారుస్తాడు.

ఉరేసుకోవడం వల్ల గొంతు సరిగా లేకున్నా  వైఎస్ఆర్‌కు రైతు ఏదో చెప్పబోతుంటారు,. అయితే రైతు ఏం మాట్లాడలేడని డాక్టర్ అంటే... అతను ఏం చెప్పాడో తనకు వినపడుతోందని  వైఎస్ఆర్ అన్న మాటలు సెంటిమెంట్‌ను తట్టిలేపుతాయి.

ఆ తర్వాత రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల‌ ముట్టడికి పిలుపు ఇస్తాడు  వైఎస్ఆర్. ఈ సమయంలో అరెస్టైన రైతులతో పాటు తాను అరెస్టు అయినట్టుగా చిత్రంలో చూపిస్తారు.

ఈ సందర్భంగానే రైతులకు ఉచితంగా విద్యుత్‌ను అందించనున్నట్టు వైఎస్ఆర్ హామీ ఇస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు... మీరు ఎలా హామీ ఇస్తారని ఓ జర్నలిస్ట్ వైఎస్ఆర్‌ను ప్రశ్నిస్తారు. 

 అయితే మాట ఇచ్చాక... ముందుకు వెళ్లాల్సిందేనని చెబుతాడు. అంతేకాదు పార్టీ ఎవరిని సీఎం చేసినా కూడ ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా నిర్ణయం తీసుకొనేలా తాను ఒత్తిడి తీసుకొస్తానని వైఎస్ఆర్ చెప్పినట్టుగా సినిమాను తెరకెక్కించారు.

పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ అనారోగ్యానికి గురై పది రోజులకు పైగా యాత్రకు విరామిచ్చారు. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్  విశ్రాంతి తీసుకొన్నారు. ఈ సమయంలోనే గవర్నమెంట్ ఆసుపత్రిలో వైఎస్ఆర్ చికిత్స తీసుకొంటున్న సమయంలో  గుండె జబ్బుతో చిన్నారి ఆసుపత్రికి వస్తోంది.

ఈ ఆసుపత్రిలో ఈ జబ్బుకు చికిత్స చేయడానికి ఇంకా చాలా రోజుల సమయం పడుతోంది... అప్పటి వరకు ఆలస్యం చేస్తే బిడ్డ దక్కడం కష్టమని చెబుతారు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ సూచిస్తారు.  ఈ వైద్యం చేయించాలంటే  కనీసం రూ.3 లక్షలు ఖర్చు అవుతోందని ప్రభుత్వ డాక్టర్ చెబుతారు ఈ సన్నివేశాలన్నీ సినిమాలో ఉన్నాయి.

గుండె జబ్బుతో బాధపడే చిన్నారి అక్కను ఆమె తల్లి ఒక్క ఇంట్లో జీతం కుదిరిస్తే రూ.3 లక్షలు చెల్లించేందుకు ఎన్ఆర్ఐ దంపతులు ముందుకు వస్తారు. ఆ సమయంలోనే గుండె జబ్బు చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ శస్త్రచికిత్స చేసినా కూడ ఆ చిన్నారి బతకదు.

ఎంత ఖర్చైనా  ఏ ఆసుపత్రుల్లోనైనా ఉచితంగా వైద్యం అందేలా చేస్తానని వైఎస్ఆర్ హామీ ఇస్తారు. ఒక్క కార్డును ఇచ్చి ఆ కార్డు తీసుకెళ్తే ఏ ఆసుపత్రిలోనైనా ఉచితంగా వైద్యం చేయిస్తామని ప్రకటించినట్టుగా సినిమాలో చూపించారు.

తన వద్ద గన్‌మెన్‌గా ఉన్న బాషా అనే వ్యక్తి తన లెటర్‌ను ఫోర్జరీ చేసి రూ.35 వేలు తీసుకొన్నాడని  తెలిసి అసలు విషయం అతడిని వైఎస్ఆర్ అడుగుతారు. తన కొడుకు చదువు కోసం తాను తప్పు చేసినట్టుగా ఒప్పుకొన్నట్టుగా ఈ సినిమాలో చూపించారు.

తన కొడుక్కి ఇంజనీరింగ్‌లో  సీటు వచ్చిందని..... ఈ ఫీజును చెల్లించేందుకు తాను ఇలా చేశానని చెబుతారు. యాత్ర సాగుతున్న సమయంలోనే ఓ గ్రామంలో ఓ మహిళ తనకు ఎదురుగా వచ్చి  తన కొడుక్కి  ఇంజనీరింగ్ సీటు వచ్చిందని చెబుతోంది.

ఎన్నికల్లో ప్రభుత్వం వస్తోంది... ప్రభుత్వం వస్తే నేరుగా కాలేజీ యాజమాన్యాన్ని కలవాలని ఆమెకు చెబుతారు. లేకపోతే తనను వచ్చి కలవాలంటారు. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ స్కీమ్‌ కోసం ఈ రెండు సమస్యలను ఈ సినిమాలో ప్రధానంగా హెలైట్ చేసి చూపించారు.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

Follow Us:
Download App:
  • android
  • ios