పిఠాపురం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం సభలో వర్మపై పవన్ కళ్యాణ్  విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ విమర్శలపై వర్మ స్పందించారు.

ప్రజా పోరాట యాత్రలో భాగంగా మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వర్మపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. టీడీపీ నేతలను బ్రోకర్లు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వర్మ ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కు భాష, సంస్కారం తెలియదన్నారు. పవన్ వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకొంటున్నారని వర్మ చెప్పారు.

మీ దగ్గర ఏం పనిచేశామని బ్రోకర్లం అయ్యామో చెప్పాలని వర్మ ప్రశ్నించారు. ఏ పార్టీలో విలీనమయ్యాయమా.. లేక అమ్ముడు పోయామా అంటూ ప్రజారాజ్యం  పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల పంచలు ఊడదీస్తామని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ అదే కాంగ్రెస్ పార్టీతో చేరిపోయారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

లోకేష్ పంచాయితీ బోర్డు మెంబర్ కాలేదు.. సరే...మరి పవన్ కళ్యాణ్ దేనికి మెంబర్ అయ్యారని చురకలింటించారు.చంద్రబాబుకు మీ మాదిరిగా నటించడం చేతకాదని పవన్ ను ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

పిఠాపురం నుండి పోటీ చేస్తా: పవన్

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

కేంద్రానికి లేఖ రాశా, ఇవిగో ఆధారాలు:చంద్రబాబుకు పవన్ కౌంటర్

కుల రాజకీయాలు చేసే పార్టీ కాదు,కులాలను కలిపే పార్టీ జనసేన:పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్