పిఠాపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి  పోటీ చేసే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో మంగళవారం నాడు నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు.

తనను పిఠాపురం నుండి  పోటీ చేయాలని పలువురు అడుగుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. శ్రీపాదశ్రీవల్లభుని ఆశీస్సులు  ఉంటే పిఠాపురం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  

తిరుపతి, ఇచ్చాపురం,అనంతపురం నుండి పోటీ చేయాలని కోరుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ విషయమై తాను పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ఆడపడుచుపై దాడి చేస్తారా అంటూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా గొల్లప్రోలు శానిటరీ ఇనస్పెక్టర్‌ శివలక్ష్మి చేతులతో మురుగు తీయించిన విషయాన్ని ప్రస్తావించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పేకాట క్లబ్బులు ఆడే వారికి  ఎమ్మెల్యే పదవులు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ప్రజలు బానిసలు కాదన్నారు. దళితులు, ఆడపడుచులు, యువతుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని జనసైనికులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

కేంద్రానికి లేఖ రాశా, ఇవిగో ఆధారాలు:చంద్రబాబుకు పవన్ కౌంటర్

కుల రాజకీయాలు చేసే పార్టీ కాదు,కులాలను కలిపే పార్టీ జనసేన:పవన్

నేను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు: తిత్లీపై బాబుకు పవన్ కౌంటర్

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్