Asianet News TeluguAsianet News Telugu

సజ్జల గారు... మాధవ్ న్యూడ్ వీడియోను మీ కుటుంబానికి చూపించగలరా..: బోండా ఉమ సంచలనం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీకై రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా ఆయనను వైసిసి ప్రభుత్వం అండగా నిలుస్తోందని... ఇలా ఆయనను మద్దతిస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ అసభ్య వీడియోను కుటుంబసభ్యులకు చూపించగలరా అని టిడిపి నేత బోండా ఉమ నిలదీసారు. 

TDP Leader Bonda Uma Reacts on YSRCP MP Gorantla Madhav Video
Author
Amaravati, First Published Aug 10, 2022, 3:29 PM IST

అమరావతి : వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పై న్యూడ్ వీడియో కాల్ పై ఏపీ రాజకీయాల్లో వివాదం కొనసాగుతోంది. అధికార వైసిపి ఎంపీ న్యూడ్ వీడియో ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్ష టిడిపి మాధవ్ పై చర్యలకు డిమాండ్ చేస్తోంది. దీంతో ఇరుపార్టీలు మధ్య రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ వైసిపి నాయకుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మాధవ్ ను వెనకేసుకువస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు ఇతర వైసిపి నాయకులు ఆ న్యూడ్ వీడియోను కుటుంబసభ్యులకు చూపగలరా..? అని బోండా ఉమ నిలదీసారు. 

మాధవ్ వీడియో మాదిరిగానే మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అసభ్య ఫోన్ కాల్ రికార్డింగ్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎందుకు పంపలేదని ఉమ ప్రశ్నించారు. కేవలం మాధవ్ వీడియోతో పార్టీపై పెల్లుబుకిన ప్రజాగ్రహం దృష్టి మళ్లించడానికే వైసిపి నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకునే వరకు ఆయన న్యూడ్ వీడియోపై వివాదం కొనసాగుతూనే వుంటుందన్నారు బోండా ఉమ. 
 
ప్రస్తుతం ఒంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్కగట్టే టెక్నాలజీ అందుబాటులో ఉంది... అయినా మాధవ్ వీడియోపై ఇంత జాప్యం ఎందుకని ఉమ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మాధవ్ అసభ్యకర వీడియో ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని అన్నారు. మాధవ్ ఢిల్లీ నుంచి హిందూపురానికి వెళ్తున్నారట... ఏ డ్రెస్సులో వస్తారోమరి... న్యూడ్ వీడియోలో కన్పించినట్టే అనంతపురానికి వస్తారా..? అంటూ బోండా ఉమ ఎద్దేవా చేసారు. 

read more  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో: ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అనంత పోలీసులు

ఇక జనసేన, బిజెపిలతో పొత్తుకోసం టిడిపి ప్రయత్నిస్తోందని... అందుకోసమే చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందిదే తడవుగా డిల్లీకి వెళ్లారంటూ జరుగుతున్న ప్రచారంపై ఉమ స్పందించారు. 40 ఏళ్లల్లో కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం... కలిసొచ్చే పార్టీలతో పొత్తులు సహజమేనని అన్నారు. ఈసారి కూడా పొత్తులపై ఏదయినా నిర్ణయం తీసుకుంటే స్వయంగా చంద్రబాబే చెబుతారన్నారు. రహస్యంగా పొత్తులు పెట్టుకోవడం కుదరదని బోండా పేర్కొన్నారు. టిడిపి అధినేత ఢిల్లీ పర్యటనతో వైసీపిలో ఉలికిపాటు... తాడేపల్లిలో వణుకు మొదలైందన్నారు. 

తన సొంత కేసుల కోసమే జగన్ ఢిల్లీ వెళుతున్నారని.. చంద్రబాబు అలా కాదని ఉమ పేర్కొన్నారు. జగన్ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క పనైనా పూర్తి చేసుకుని వచ్చారా..? అని ప్రశ్నించారు. సింహంలా ఫోజులిస్తూ ఫ్లైటెక్కడం.. ఢిల్లీలో లెగ్ అప్పీల్ చేసుకోవడం... ఇదే జగన్ తీరు అంటూ ఎద్దేవా చేసారు. ఇక ఏ2 విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని లంచులు...సంచులతో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఛీ కొట్టించుకున్నారని ఉమ గుర్తుచేసారు. ఓటుకు నోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరు కూడా లేదన్నారు. లేని కేసులో చంద్రబాబు ఉన్నారని చెప్పిన సజ్జల.. జగన్ కేసుల గురించి ఏమంటారు..? అని ప్రశ్నించారు. జగన్ 13 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు... 18 నెలలు జైల్లో ఉన్నారు... ఇప్పటికీ దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే... అలాంటి సీఎం గురించి ఎందుకు మాట్లాడరు అంటూ సజ్జలకు ఉమ చురకలు అంటించారు. 

అరాచక, అవినీతి పాలనతో వైసిపితో పాటు సీఎం జగన్ గ్రాఫ్ కూడా పడిపోతుంది.. అందుకే కార్యకర్తలను కూడా పిలిచి ఆయన మాట్లాడుతున్నారన్నారు. గతంలో సీఎం ఇంటి గేటు ముందు బొత్స దిగితే టైమ్ లేదని వెనక్కి పంపేశారు... అలాంటి పరిస్థితి నుంచి పిలిపించుకుని మాట్లాడే స్థితికి చేరారన్నారు. ఇదే  వైసిపి తాజా పరిస్థితికి అద్దం పడుతుందని బోండా ఉమ పేర్కొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios