Asianet News TeluguAsianet News Telugu

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో: ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన అనంత పోలీసులు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు అనంతపురం పోలీసులు. ఎంపీ అభిమాని అంటూ వెంకటేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వీడియోను పరీక్ష కోసం పోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

Anantapur Police Sents Hindupur MP Gorantla Madhav Nude Video to Forensic Lab
Author
Anantapur, First Published Aug 10, 2022, 1:02 PM IST

అనంతపురం: Hindupur mp ఎంపీ Gorantla Madhav అశ్లీల వీడియోను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు  అనంతపురం పోలీసులు పంపారు.ఈ వీడియోను మార్ఫింగ్ చేశారా, నిజమైన వీడియో అనే విషయాన్ని Forensic Lab నివేదిక తేల్చనుంది. 

గత వారంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోపై ఎంపీ మాధవ్ స్పందించారు. తన ప్రతిస్టను దిగజార్చేందుకు ఈ వీడియోను TDP నేతలు మార్ఫింగ్ చేశారని ఎంపీ మాధవ్ ఆరోపించారు.  ఈ అశ్లీల వీడియో వెనుక చింతకాయల విజయ్ పాత్రుడు సహా మరో ఇద్దరు ఉన్నారని కూడా ఎంపీ మాధవ్ ఆరోపించారు. ఈ విషయమై తాను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.తాను జిమ్ చేసే వీడియోను మార్ఫింగ్ చేశారని టీడీపీ నేతలపై ఎంపీ మాధవ్ మండిపడ్డారు. 

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  అభిమానిగా చెప్పుకుంటున్న వ్యక్తి Anantapur టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎంపీ మాధవ్ పరువుకు భంగం కల్గించేలా ఈ వీడియోను సృష్టించారని వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని ప్రముఖ తెలగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అనంతపురం పోలీసులు ఐటీ చట్టం మేరకు కేసు నమోదు చేశారు. ఈ వీడియో విషయమై ఎంపీ అభిమానిగా చెప్పుకొంటున్న వెంకటేష్ పోలీసులకు ఇచ్చిన ఆధారాలను పోలీసులు తీసుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆధారాలను పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

ఎంపీ వీడియో మార్ఫింగ్ వీడియోనా, అసలు వీడియోనా అనే విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తేలనుంది. ఈ వీడియో అసలుదో  కాదో తేలిన తర్వాత చర్యలు తీసుకొంటామని వైసీపీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ వీడియో అసలుదని తేలితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకొంటామని  కూడా ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూఢిల్లీలోనే ఉన్నారు. రెండు రోజుల తర్వాత మాధవ్ ఢిల్లీ నుండి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 12, 13 తేదీల్లో కూడా  మాధవ్  జిల్లాకు వచ్చే అవకాశం  ఆయన అభిమానులకు సమాచారం అందిందని ఈ కథనం తెలిపింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో విషయమై టీడీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.ఎంపీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు లేఖ అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios