Asianet News TeluguAsianet News Telugu

చింతమనేని కేసు... ఎస్ఐ క్రాంతి ప్రియపై సస్పెన్షన్ వేటు

రెండు రోజుల క్రితం ఏలూరు త్రీటౌన్ సీఐ మూర్తి సస్పెన్షన్ వేటుకు గురికాగా... తాజాగా ఎస్ఐ క్రాంతి ప్రియను కూడా సస్పెండ్ చేశారు. చింతమనేనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టలేదని ఎస్ఐ క్రాంతి ప్రియపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమెను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

SI Kranthi Priya suspended over chintamaneni case
Author
Hyderabad, First Published Sep 7, 2019, 11:27 AM IST

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో ఓ మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. చింతమనేని తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ పలువురు బాధితులు ఫిర్యాదు చేసినా కొందరు పోలీసు అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలో చింతమనేని పై కేసులు నమోదు చేయని పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.

రెండు రోజుల క్రితం ఏలూరు త్రీటౌన్ సీఐ మూర్తి సస్పెన్షన్ వేటుకు గురికాగా... తాజాగా ఎస్ఐ క్రాంతి ప్రియను కూడా సస్పెండ్ చేశారు. చింతమనేనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా కేసులు పెట్టలేదని ఎస్ఐ క్రాంతి ప్రియపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమెను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా... ప్రస్తుతం చింతమనేని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. 

చింతమనేని ప్రభాకర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఏలూరు కోర్టులో చింతమనేని ప్రభాకర్ లొంగిపోతాడని ప్రచారం జరుగుతుండటంతో కోర్టు చుట్టూ మఫ్టీలో పోలీసులు మోహరించారు. అంతేకాదు ఇప్పటికే దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు సైతం అంటించారు.  

ఇదిలా ఉంటే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై ఫిర్యాదులు చేసేందుకు బాధితులు ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చింతమనేని తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవాల్ కు ఫిర్యాదు చేశారు. 

గతంలో తమ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఆ కేసులపై సత్వరమే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ చట్టప్రకారం రీ ఎంక్వయిరీ చేపడతామని హామీ ఇచ్చారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చింతమనేని కేసులో అలసత్వం: సీఐ సస్పెన్షన్, మరికొందరి పోలీసులపై వేటు..?

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌

అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే చింతమనేని

పోలవరం పైపులు చోరీ చేశాడు:చింతమనేనిపై పోలీసులకు ఫిర్యాదు

ఇసుక కొరతపై ఆందోళన... చింతమనేని గృహ నిర్భందం

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు

 

Follow Us:
Download App:
  • android
  • ios