ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ  ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌  పోలవరం కాలువ నుండి నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన పైపులను దొంగిలించారని  సత్యనారాయణ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలవరం కాలువ నుండి  నీటిని తోడేందుకు పైపులను ఏర్పాటు చేశారు. అయితే ఈ పైపులను తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్టుగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెబుతున్నారు. ఈ కారణంగానే తాను పైపులను తీసివేసినట్టుగా ఆయన  వివరించారు.

అయితే కాలువ నుండి  నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన పైపులను తొలగించడంతో  రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  దెందులూరు నుండి మూడో దఫా పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు.  దీంతో  పైపులను తొలగించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రైతు సత్యనారాయణ చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.