ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై శుక్రవారం నాడు కేసు నమోదైంది. పెదవేగి మండలంలోని  పినకమిడి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం తనపై కక్షసాధింపుకు పాల్పడుతోందని చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  దెందులూరు మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ పై తొలి కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న  సమయంలో కూడ ఆయనపై కేసులు నమోదయ్యాయి.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  కూడ చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

పినకమిడి గ్రామస్తులపై గురువారం రాత్రి చింతమనేని  ప్రభాకర్ దాడికి దిగాడని ఏలూరు ఎస్పీ కార్యాలయం ముందు ఆ గ్రామస్తులు శుక్రవారం నాడు ధర్నాకు దిగారు. 24 గంటల్లో చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేస్తామని  పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళనను విరమించారు.

ఈ కేసుపై చింతమనేని ప్రభాకర్ స్పందించారు. ప్రభుత్వం తనపై తప్పుడు కేసును బనాయించిందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకొన్న ఘటనలను చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తప్పుడు కేసులతో తనను భయపెట్టలేరని ఆయన తేల్చి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిజాయితీగా ఉన్నా...భవిష్యత్తులో కూడ నిజాయితీగానే ఉంటాననని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్, ఉద్రిక్తత

టీడీపీ ఆందోళన...దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగింది: జగన్‌పై లోకేశ్ ఫైర్