నమ్మించి వివాహితపై రేప్: వీడియోలతో బ్లాక్ మెయిల్

First Published 2, Jun 2018, 2:02 PM IST
Shekhar arrested for sexual harassment   in Nellore district
Highlights

వివాహితకు షాకిచ్చిన ఫ్రెండ్

నెల్లూరు:ఒకే కాలేజీలో చదువుకొన్నారు. పాత స్నేహన్ని
ఆసరాగా చేసుకొని వివాహిత కుటుంబంతో పరిచయం
పెంచుకొన్నాడు. ఆమెను నమ్మించి అత్యాచారానికి
పాల్పడ్డాడు. ఆమె నగ్న వీడియోలు  తీసి  బ్లాక్‌ మెయిల్ కు
పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది.


నెల్లూరు జిల్లాలో  పసుపులేటి శేఖర్ అనే వ్యక్తి   ఓ కావలిలో
నివాసం ఉంటున్న వివాహితపై కన్నేశాడు. ఆమె, శేఖర్
గతంలో ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు.

వివాహితపై కన్నేసిన శేఖర్ ఆమె భర్తతో పరిచయం
పెంచుకొన్నాడు. వివాహిత భర్త ఓ కూల్ డ్రింక్ దుకాణం
నిర్వహిస్తున్నాడు. వివాహిత ప్రైవేట్ విద్యాసంస్థలో
పనిచేస్తోంది.

నెల్లూరులో తనకు తెలిసిన దుకాణాల ద్వారా చౌకగా
కూల్‌డ్రింకులను ఇప్పిస్తానని ఆ వివాహితను నమ్మించాడు.
ఆమెను నెల్లూరుకు తీసుకెళ్ళాడు.

మధ్యాహ్నం హోటల్‌లో భోజనం చేసిన తర్వాత  అదే
హోటల్ లో తన స్నేహితుడి రూమ్ ఉందని ఆమెను
నమ్మించాడు. ఫ్రెష్ అయిన తర్వాత  కూల్‌డ్రింకుల
కొనుగోలు కోసం వెళ్దామని నమ్మించాడు.

కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె
మత్తులోకి చేరుకొన్నాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేకాదు ఆమె నగ్న వీడియోలు తీశాడు. 

స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు ఈ విషయమై
నిందితుడిని నిలదీసింది. అయితే ఈ విషయాన్ని బయట
ఎవరికీ కూడ చెప్పొద్దని హెచ్చరించాడు.

బయట ఎవరికైనా ఈ విషయాలను చెబితే తన వద్ద ఉన్న
నగ్న వీడియోలను బయటపెడతానని ఆమెను  బెదిరించాడు.
ఈ వీడియోలను ఆసరాగా చేసుకొని పలుమార్లు ఆమెపై
అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఈ విషయం శేఖర్ కుటుంబసభ్యులకు తెలిసింది.
శేఖర్ కుటుంబసభ్యులు కూడ వివాహితను హెచ్చరించారు.
అదే సమయంలో శేఖర్ కూడ తనకు రూ. 10 లక్షలు
ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. 

రూ. 10 లక్షలు ఇవ్వకపోతే నగ్న వీడియోలను
బయటపెడతానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. దీంతో
బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు
నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 
 

loader