Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ లో సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌

ఆంధ్రప్రదేశ్ లోని 1,22,343 మంది సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

Sex workers living in Andhra Pradesh getting Free Ration - bsb
Author
Hyderabad, First Published Nov 4, 2020, 10:32 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని 1,22,343 మంది సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సెక్స్‌ వర్కర్లకు ఉచిత రేషన్‌ అందజేయాలని సుప్రీం కోర్టు గత నెలలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్, లీగల్‌ ఆర్గనైజేషన్లు గుర్తించిన సెక్స్‌ వర్కర్లకు రేషన్‌ పంపిణీ చేయడంతోపాటు ఆ వివరాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా నవంబర్‌ నెల రేషన్‌ అందజేయనుంది. 

చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రేషన్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్రంలో 1.22 లక్షల మంది సెక్స్‌ వర్కర్లు ఉన్నట్టు ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. 

వీరిలో హోమో సెక్సువల్స్‌తోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఎంత రేషన్‌ ఇస్తోందో అంతే మొత్తంలో సెక్స్ వర్కర్లకు పంపిణీ చేయనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios