అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకృతిపై మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు సేవ్ నల్లమల ఉద్యమం పేరుతో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నడుంబిగించిన పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణపై వరుస ట్వీట్లు చేశారు.

ప్రకృతితో మమేకమవ్వాలన్న విషయాన్ని బలంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన పుస్తకాలను వరుసగా తన ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా మరో పుస్తకాన్ని ట్విట్టర్ వేదికగా పరిచయం చేశారు.  

ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన 'గడ్డిపరకతో విప్లవం' వన్ స్ట్రా రెవల్యూషన్‌ పుస్తకం గురించి ట్వీట్ చేశారు. ప్రకృతితో అనుసంధానమై వ్యవసాయం ఎలా చేయాలో చెప్పే స్ఫూర్తిదాయకమైన పుస్తకం గడ్డపరకతో విప్లవం అంటూ పవన్ కొనియాడారు. 

ప్రకృతిమాత గురించిన లోతైన నిజాలను అర్థమయ్యేలా గడ్డిపరకతో విప్లవం పుస్తకం చేస్తుందని తెలిపారు.  జపాన్‌కు చెందిన మసనోబు తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయానికే కేటాయించారని తెలిపారు. 

కృతిమ పద్ధతులకు స్వస్తి చెప్పి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అద్భుతాలు సృష్టించారని తెలిపారు. ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మహత్వాన్ని తెలియజేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వన్ స్ట్రా రెవల్యూషన్ పుస్తకం 25కు పైగా భాషల్లో అనువాదమైనట్లు చెప్పుకొచ్చారు.  

అందులో భాగంగా తెలుగులో కూడా గడ్డిపరకతో విప్లవం పేరుతో వన్ స్ట్రా రెవల్యూషన్ పుస్తకం అనువాదమైనట్లు తెలిపారు. 1913లో పుట్టిన మసనోబు 95 ఏళ్ల వయస్సులో 2008లో మరణించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కల్యాణ్ తో దోస్తీపై నిరసన: హీరోను చేయడమేమిటని ప్రశ్న

సేవ్ నల్లమల: తనవేమీ చిల్ల రాజకీయాలు కావన్న పవన్ కల్యాణ్

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ ను తిప్పికొట్టిన కేసీఆర్ వ్యూహం

సేవ్ నల్లమల: పవన్ కల్యాణ్ పై మంత్రి శ్రీనివాస గౌడ్ కామెంట్

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్

యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: తేల్చేసిన కేటీఆర్

సేవ్ నల్లమల: రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొనే నేతలు వీరే...

సేవ్ నల్లమల: తాతపై హిమాన్షు ట్వీట్, బిజెపిపై కేసీఆర్ అస్త్రం అదే...