అనంతపురం: అనంతపురం జిల్లా నుండి  పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల్లో పోటీ చేసే విషయమై టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో  పరిటాల శ్రీరామ్‌కు పోటీ చేసేందుకు వయస్సు సరిపోదని  భావించారు. అయితే  ఈ నాలుగేళ్ల కాలంలో శ్రీరామ్ కూడ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.ఈ దఫానైనా పరిటాల శ్రీరామ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర అనంతపురం జిల్లాలోనే ,ప్రారంభమైంది.ఈ పాదయాత్రలో  శ్రీరామ్ చురకుగా పాల్గొన్నారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో  పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో  సునీత చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో పరిటాల  కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ దఫా పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం కూడ లేకపోలేదు. ప్రస్తుతం సునీత రాప్తాడు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకవేళ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే  ఈ స్థానం నుండి పరిటాల శ్రీరామ్ ను బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

పరిటాల సునీత పోటీకి ఆసక్తిగా లేకపోతే శ్రీరామ్‌ను బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మంత్రి సునీత కూడ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ్ రాజకీయ భవితవ్యం చంద్రబాబునాయుడు చేతుల్లో పెట్టినట్టుగా  ఆమె ప్రకటించారు.

ఈ నాలుగేళ్ల కాలంలో  రాప్తాడు నియోజకవర్గంతో పాటు టీడీపీ కార్యక్రమాల్లో పరిటాల శ్రీరామ్ చురుకుగా పాల్గొంటున్నారు.  ఇటీవల జరిగిన రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన బీసీ సదస్సులో  పరిటాల శ్రీరామ్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది.ప్రత్యర్థి పార్టీని ప్రస్తావించకుండానే  శ్రీరామ్ ఘాటైన విమర్శలు చేశారు.

పార్టీ నాయకత్వం అంగీకరిస్తే ఈ దఫా ఎన్నికల్లో శ్రీరామ్‌ను బరిలోకి దింపేందుకు కుటుంబం సంసిద్దంగా ఉందని చెబుతున్నారు. అయితే  శ్రీరామ్‌ పోటీకి చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడ పార్టీ వర్గాల్లో  ప్రచారంలో ఉంది. ఈ విషయమై స్పష్టత రావాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

పరిటాల,మద్దెలచెర్వు రక్తచరిత్ర ఇదీ: ఇక ముగిసేనా?

పరిటాల కుటుంబం కళ్లలో ఆనందం కోసమే: భానుపై భానుమతి సంచలనం

భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి