Andhra Pradesh

Jagan Under Legal Fire, ED Attaches Rs 793 Cr Assets in DA Case in telugu tbr

YS Jagan cases-ED: జగన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో జైలుకేనా.. కేసులన్నీ బయటికీ లాగుతున్నారు!

Jagan DA case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఇటీవలే జగన్‌ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలైన (సీబీఐ), ఈడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీంతో వైసీపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణ కథనం.