సారాంశం

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు"ధైర్యం లేనిచోట ధర్మం కోల్పోతారు" అనే కవితతో వీరత్వాన్ని నింపినందుకు సైన్యాన్ని అభినందించారు.

Pawan Kalyan : 'ఆపరేషన్  సింధూర్'... భారతదేశంలో ఎక్కడచూసినా ఇదే మాట వినిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల పనిపట్టడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. పాక్ తో పాటు పివోకే లోని 9 ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి వాయుసేన యుద్దవిమానాలు దాడులు చేసాయి. ఇందులో వందకు పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.  

ఆపరేషన్ సింధూర్ పై రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు... భారత్ చర్యలను సమర్దిస్తూ ఆర్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. తనదైన స్టైల్లో ఓ అద్భుత కవిత్వాన్ని జోడించి ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేసారు.

 ''ధైర్యం లేనిచోట ధర్మం కోల్పోతారు. స్వార్థం రాజ్యమేలుతుంది'' అంటూ ప్రముఖ రచయిత దినకర్ హిందీలో రాసిన కవిత్వాన్ని పవన్ పోస్ట్ చేసారు.  '' దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి...  "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము... జైహింద్!'' అంటూ పవన్ కల్యాణ్ ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ అయ్యారు.   

ఆపరేషన్ సిందూర్ పట్ల దేశం గర్వంగా ఉంది : పవన్ కళ్యాణ్ 

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలు గర్వపడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. భారత సైన్యం సాహసోపేతంగా పాక్ భూభాగంలో ఉగ్రస్థావరాలపై దాడి చేసిందన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మరోసారి ఆ సైనిక చర్య ద్వారా మోదీ సర్కార్ స్పష్టం చేసిందని పవన్ పేర్కొన్నారు. 

పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలకుగానీ, ఆర్మీకి గానీ ఈ ఆపరేషన్ సింధూర్ తో ఎలాంటి హాని జరగలేదన్నారు. ఖచ్చితంగా ఉగ్రవాద స్థావరాలను గుర్తించాకే భారత్ ఈ ఎయిర్ స్ట్రైక్ చేపట్టిందన్నారు. భారత్ లో హింసకు కారణమవుతున్న ఉగ్రమూలను మాత్రమే భారత సైన్యం టార్గెట్ చేసిందని... సక్సెస్ ఫుల్ గా ఆ పనిని పూర్తి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.