Asianet News TeluguAsianet News Telugu

ఒంగోలులో డ్రగ్ ఇన్ స్పెక్టర్ నగ్న వీడియోల కలకలం.. తోటి మహిళా అధికారిణికి లైంగిక వేధింపులు..

ఒంగోలులో ఓ డ్రగ్ ఇన్ స్పెక్టర్ కు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కలకలం చెలరేగింది.

Ongole drug inspector nude video viral in social media
Author
First Published Dec 12, 2022, 10:52 AM IST

ఒంగోలు :  ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ డిపార్ట్మెంట్ లో కలకలం చెలరేగింది. ఈ శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు సంబంధించిన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతను ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని ఒక కాలేజీ కి సంబంధించిన ఆర్గనైజింగ్ పార్టనర్ కి అల్లుడు. గతంలో  కర్నూలులో పని చసే సమయంలో..  తనతో పాటు పనిచేసిన ఓ మహిళా అధికారిణిని లోబరుచుకున్నాడు. ఆమె ఒంగోలుకు చెందిన అధికారిణి. ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారిని ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తుంది.  

వీరిద్దరు కలిసి కొంతకాలం సహజీవనం కూడా చేసినట్లుగా సమాచారం. అంతేకాదు సదరు  డ్రగ్ ఇన్ స్పెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో పనిచేసే సమయంలో ఇదే విషయం మీద అక్కడి అధికారులకు ఆ మహిళా అధికారిణి  ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో వారు వీరిద్దరికీ కౌన్సిలింగ్ చేసి  పంపించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తనకు న్యాయం జరగలేదని ఆమె ఇప్పుడు మీడియాను ఆశ్రయించింది. 

వీడెక్కడి మొగుడ్రా బాబూ.. ఆహారంలో వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించాడు..

ఫిర్యాదు విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ అని ప్రశ్నించగా..  ఆ మహిళా అధికారిణి కావాలనే తనను తనపై వేధింపులకు పాల్పడుతూ ఉందని అన్నారు. కర్నూలులో కౌన్సిలింగ్ తర్వాత ఆ సమయంలో ఆమెను అధికారులు మందలించారని  తెలిపాడు. తన కుటుంబం నుంచి తనను విడదీయడానికి ఆమె బెదిరింపులకు పాల్పడుతోందని అన్నాడు.  ఏదేమైనా వీడియోలు బయటకు రావడంతో వ్యవహారం ఇప్పుడు ఒంగోలు జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఒకటి... కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ టీచర్ కొంతమంది బాలికలను టూర్ పేరుతో  వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఓ హోటల్లో అందులోని ఒక బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో  స్థానికంగా కలకలం రేగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఉత్తరప్రదేశ్ మీరట్ లోని గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నవంబర్ 23వ తేదీన కొంతమంది విద్యార్థినులను బృందావన్ కు టూర్ కోసం తీసుకువెళ్లాడు. 

రాత్రిపూట ఉండేందుకు అక్కడ హోటల్ లో రెండు రూంలు తీసుకున్నాడు. ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మందిని ఒక గదిలో ఉంచాడు. ఇంకో గదిలో తను, తనతో పాటు పదకొండవ తరగతి చదువుతున్న 17 ఏళ్ల ఓ బాలికను ఉండమన్నాడు. ఆ తర్వాత ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. ఆమె అది తిన్న తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ చేస్తున్న అఘాయిత్యాన్ని ఆమె ప్రతిఘటించడంతో తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. అంతేకాదు చంపేస్తానని కూడా హెచ్చరించాడు. హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, అటు తర్వాత విద్యార్థులంతా నవంబర్ 24న తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారు. 

మొదట బాధితురాలు ఈ ఘటన మీద మౌనంగానే ఉంది.  కానీ ఆ తర్వాత తల్లిదండ్రులకు దారుణం అని వివరించింది.  చూసుకోవాల్సిన  ప్రిన్సిపల్  ఇంత  నీచానికి పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు శనివారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ మీద  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios