మండపేట: జషిత్ కిడ్నాప్ వెనుక క్రికెట్ బెట్టింగ్  ముఠా హస్తం ఉండా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  జషిత్‌‌ను కిడ్నాపర్లు వదిలివేసిన స్థలం క్రికెట్టు బెట్టింగ్ లు జరిగే ప్రాంతానికి సమీపంలోనే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మండపేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి జషిత్ ను ఈ నెల 22వ తేదీన కిడ్నాప్ చేశారు. గురువారం ఉదయం కుతకుతలూరుకు సమీపంలోని చింతాలమ్మ గుడి వద్ద జషిత్‌ను కిడ్నాపర్లు వదిలేశారు. 

తూర్పుగోదావరి జిల్లాలో ఆనపర్తి మండలం కుతకుతకలూరు, మండపేటలో క్రికెట్ బెట్టింగ్‌ సాగుతుంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే జషిత్ ను వదిలివెళ్లడం ప్రస్తుతం అనుమానాలకు తావిస్తోంది.

జషిత్ తండ్రి వెంకటరమణ క్రికెట్ ప్లేయర్. ప్రతి ఆదివారం నాడు వెంకటరమణ క్రికెట్ ఆడుతాడు. క్రికెట్ బెట్టింగ్ ముఠా తమకు డబ్బులు బకాయిలు ఉన్నవారితో ఈ రకంగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడ ఉంది.

జషిత్‌ను వదిలివెళ్లిన స్థలాన్ని జిల్లా ఎస్పీ నయీం గురువారం నాడు పరిశీలించారు. ఇటుక బట్టీ కార్మికులను ఇటుక బట్టీ యజమానిని ఎస్పీ విచారించారు.  అనంతరం రాయవరం పోలీస్ స్టేషన్‌ లో పోలీసులతో సమావేశం నిర్వహించారు.

వెంకటరమణ కు క్రికెట్ ఆడే అలవాటు ఉంది. అయితే అతను ఏమైనా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను క్రికెట్ ఆడుతానని బెట్టింగ్ లకు ఏనాడూ కూడ పాల్పడలేదని జషిత్ తండ్రి వెంకటరమణ చెప్పారు. తనపై క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడినట్టుగా జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు.

జషిత్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తిని రాజు అని చెబుతున్నారు.  అయితే జషిత్ కుటుంబానికి తెలిసిన వారే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

జషిత్ క్షేమం: తూర్పు గోదావరి ఎస్పీకి జగన్ అభినందన

నాలుగు రోజుల తర్వాత ఇంటికి జషిత్ : భావోద్వేగానికి గురైన పేరేంట్స్

కిడ్నాపర్లను పట్టుకొంటాం: ఎస్పీ నయీం

బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ