మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడిని కిడ్నాప్ చేశారు. తెలిసిన వారే బాలుడిని కిడ్నాప్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మండపేటలోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్  కొడుకును సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు కిడ్నాప్ చేశారు. 

బాలుడి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మనమడితో పార్వతి అనే మహిళ బయటకు వెళ్లింది. ఈ సమయంలో కిడ్నాపర్ పార్వతిపై దాడి చేసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 

ఈ విషయమై బాధితుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు జరుపుతున్నారు. తెలిసినవారే బాలుడిని కొంత దూరం వెంబడించారు. అయితే క్షణాల్లోనే నిందితులు పారిపోయారని స్థానికులు చెప్పారు.