మండపేట: తన కొడుకును క్షేమంగా తిరిగి వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ  జషిత్ తల్లి దండ్రులు  ధన్యవాదాలు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత కొడుకును చూసేసరికి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. 

గురువారం నాడు ఉదయం కుతకుతలూరు సమీపంలోని చింతాలమ్మ గుడి వద్ద ఉన్న ఓ ఇంటి వద్ద జషిత్ ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. ఎస్పీ నయీం జషిత్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.

కొడుకును ఎస్పీ దగ్గర నుండి తీసుకొని తల్లి నాగావళి తన గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తారు.కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఇరుగు పొరుగు వారు కూడ జషిత్ ను చూసి కన్నీళ్లు పెట్టుకొన్నారు.

జషిత్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కొడుకును సురక్షితంగా తమకు అప్పగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన కొడుకు సురక్షితంగా రావడం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి కన్నీళ్లు పెట్టుకొంటూ తండ్రి వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కిడ్నాపర్లను పట్టుకొంటాం: ఎస్పీ నయీం

బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్

కిడ్నాపర్ల చెర నుండి జషిత్ క్షేమంగా ఇంటికి

జషిత్ నా వద్దే ఉన్నాడు: తండ్రికి ఢిల్లీ నుండి ఫోన్

మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

మండపేటలో బాలుడి కిడ్నాప్: ఇంకా దొరకని ఆచూకీ