Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నేతలపై ఐటీ గురి.. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఇంట్లో సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్నటి నుంచి అధికార టీడీపీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతుండటం దుమారాన్ని రేపుతున్నాయి.

IT Raids on TDP MLA pothula rama rao
Author
Kandukur, First Published Oct 5, 2018, 1:36 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్నటి నుంచి అధికార టీడీపీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతుండటం దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఇంటిపై దాడి చేసిన ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఎమ్మెల్యేతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రామారావు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. తర్వాత టీడీపీలో చేరారు.

రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను నిజం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు తెలుగుదేశం నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది.

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఫ్యాక్టరీలు, నివాసాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించారు. చెన్నైలోని మస్తాన్‌రావు నివాసం, కార్పోరేట్ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలోని విమానాశ్రయ భూముల వద్ద రోయ్యల మేత ఫ్యాక్టరీ, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్ యూనిట్‌పై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

‘‘బీఎంఆర్’’ గ్రూపుతో మస్తాన్‌రావు వ్యాపారాలు చేస్తుంటారు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారాలు, తమిళ సినిమా నిర్మాణాలు చేస్తుంటారని తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో బీద మస్తాన్‌రావుతో పాటు ఆయన సోదరుడు నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అటు విజయవాడ, గుంటూరులలోని పలువురు ప్రముఖుల ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ కేంద్రంగా నడిచే సదరన్ కనస్ట్రక్షన్స్, వీఎస్ లాజిస్టిక్స్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లోనూ దాడులు నిర్వహించారు.

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

Follow Us:
Download App:
  • android
  • ios