Asianet News TeluguAsianet News Telugu

ఐటీ అధికారుల చేతిలో.. ఓ మంత్రికి చెందిన ఫైల్..?

సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. 

IT raids in ap.. officials found important file of ap minister?
Author
Hyderabad, First Published Oct 5, 2018, 12:43 PM IST

ఏపీలో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. విజయవాడ, నెల్లూరు, విశాఖ, గుంటూరు, కాకినాడ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. టీడీపీ నేతల లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. చంద్రబాబు మీద కక్ష్యతోనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా..ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో సాగుతున్న సోదాల్లో ఐటీ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి చెందినవిగా గుర్తించారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ గుర్తించింది. 

బోగస్ కంపెనీలు, ఆక్రమణలపై అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆ కంపెనీల యజమానులపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.  మొదట ఈ ఉదయం విజయవాడ నారాయణ కళాశాలకు వచ్చిన ఐటీ అధికారులు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని ఆ తరువాత మంత్రి నారాయణ ప్రకటించారు.

read more news

ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం బీజేపీకి అలవాటే..చంద్రబాబు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

Follow Us:
Download App:
  • android
  • ios