బెజవాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 8 ప్రత్యేక బృందాలు ఆటోనగర్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మకాం వేశాయి. 

బెజవాడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 8 ప్రత్యేక బృందాలు ఆటోనగర్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మకాం వేశాయి. పక్కా సమాచారంతో ఎవరెవరి ఇళ్లపై దాడులు నిర్వహించాలో ప్లాన్ సిద్ధం చేసుకుని ఉదయం నుంచి గుంటూరు, విజయవాడల్లో దాడులు నిర్వహిస్తున్నాయి.

సదరన్ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు వీఎస్ లాజిస్టిక్స్ సంస్థల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ బెంజిసర్కిల్, కానూరులలో ఉన్న నారాయణ కాలేజీల దగ్గరదాకా వెళ్లి చివరి నిమిషంలో ఐటీ అధికారులు వెనుదిరగడం చర్చనీయాంశమైంది. 8 బృందాల్లో.. 45 మంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి రక్షణగా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?