Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన

ఇప్పటికే పలువురు నేతల ఇళ్లపై సోదాలు జరపగా.. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారంటూ వార్తలు ప్రచారంలోకి  వచ్చాయి. కాగా..దీనిపై మంత్రి నారాయణ స్పందించారు.

minister narayana response on IT raides
Author
Hyderabad, First Published Oct 5, 2018, 9:59 AM IST

రాజకీయ కారణాలతో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను నిజం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు తెలుగుదేశం నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది.

ఇప్పటికే పలువురు నేతల ఇళ్లపై సోదాలు జరపగా.. మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారంటూ వార్తలు ప్రచారంలోకి  వచ్చాయి. కాగా..దీనిపై మంత్రి నారాయణ స్పందించారు.

నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేని కొట్టిపారేశారు. మరోవైపు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో గల నారాయణ కాలేజీకి ఈరోజు ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి ఉంచాలని సిబ్బందికి సూచించారు.

read more news

బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

Follow Us:
Download App:
  • android
  • ios