Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
ఇటీవల వర్షాల కారణంగా ఒక్కసారిగా పెరిగిన టమాటా ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ మార్కెట్లలో నేడు కూరగాయల ధరల ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

కూరగాయల ధరలు
వంటలో కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రసం, సాంబార్, వేపుడు, బిర్యానీ లాంటి అన్ని రకాల వంటకాలకు కూరగాయలు అవసరం. ఇక తెలుగు ప్రజలు ఏవి కొన్నా కొనకపోయినా తప్పకుండా టమాటా, ఉల్లిపాయలను కొంటారు… వంటకాల్లో వీటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి డిమాండ్ ఎక్కువ.
తగ్గిన టమాటా ధర
అయితే ఇటీవల కురిసిన వర్షాలో లేక మరేవైనా కారణాలున్నాయో తెలీదుగానీ టమాటా ధరలు బాగా పెరిగాయి. ఓ దశలో కిలో రూ.60-70 పలికింది. కానీ ప్రస్తుతం మార్కెట్ కు టమాటా పంట అత్యధికంగా రావడంతో ధర అమాంతం తగ్గింది.
హైదరాబాద్ లో కిలో టమాటా ఎంత?
కిలో టమాటా అమ్మకం ధర దాని నాణ్యతను బట్టి మారుతుంది. చిన్న సైజు టమాటాలు 5 కిలోలు 100 రూపాయలకు అమ్ముతున్నారు. మరో రకం టమాటా కిలో రూ.35 వరకు ఉంది. మొత్తంగా కిలో టమాటా రూ.20-40 కి లభిస్తుంది. నాణ్యమైన నాటు టమాటా కిలో 60 రూపాయలకు అమ్ముతున్నారు.
ఇతర కూరగాయల ధరలు
హైదరాబాద్ మార్కెట్ లో ఇతర కూరగాయల ధరలు పరిశీలిస్తే.. పెద్ద ఉల్లి కిలో రూ.20-25, చిన్న ఉల్లి రూ.60-75, పచ్చిమిర్చి రూ.35, బీట్‌రూట్ రూ.40, బంగాళదుంప రూ.20, అరటి పువ్వు రూ.12 కిలో అమ్ముతున్నారు.
కూరగాయల ధరలు
క్యాప్సికమ్ రూ.40, కాకరకాయ రూ.35, సొరకాయ రూ.35, చిక్కుడు రూ.130, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.45, క్యాలీఫ్లవర్ రూ.40. గోరుచిక్కుడు రూ.66, దోసకాయ రూ.30, మునగకాయ రూ.270-320, వంకాయ రూ.30, బీన్స్ రూ.25, అల్లం రూ.60, బెండకాయ రూ.40, ముల్లంగి రూ.15, బీరకాయ రూ.66, పొట్లకాయ కిలో రూ.20కి అమ్ముతున్నారు.

