Asianet News TeluguAsianet News Telugu

స్నేహితురాలితో మంగళగిరి యువకుడి న్యూడ్ వీడియో కాల్... ఆ తర్వాతే అసలు ట్విస్ట్...

సోషల్ మీడియా స్పేహితురాలితో నగ్నంగా వీడియో కాాల్ మాట్లాడిన మంగళగిరి యువకుడు నిలువునా మోసపోయాడు. అప్పటివరకు ప్రేమగా మాట్లాడిన యువతి నగ్న వీడియోలను చూపించి బెదిరించడంతో భయపడిపోయి డబ్బులు ముట్టజెప్పాడు. 

Girl blackmails mangalagiri boy for money after recording his nude video
Author
Guntur, First Published Dec 2, 2021, 11:23 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: సోషల్ మీడియా పరిచయం ఆ యువకుడి కొంపముంచింది. ఆన్ లైన్ లో పరిచయమైన యువతి కైపెక్కించే మాటలతో రెచ్చిపోయిన యువకుడు ఆమెతో న్యూడ్ గా వీడియో కాల్ లో పాల్గొన్నాడు. ఇంకేముంది ఆ తర్వాత యువతి చేతిలో బ్లాక్ మెయిల్ కు గురయి దారుణంగా మోసపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... guntur district మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన కడియం రాజేష్ కు ఫేస్ బుక్ లో ఓ అపరిచిత యువతినుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అయితే అమ్మాయి నుండి రిక్వెస్ట్ రావడంతో టెంప్ట్ అయిన అతడు యాక్సెప్ట్ చేశాడు. అతడితో చాటింగ్ చేసి పరిచయం పెంచుకున్న యువతి మొబైల్ నెంబర్ సేకరించింది.

ఆ తర్వాత రాజేష్ కు ప్రతిరోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ మరింత దగ్గరయ్యింది. పూర్తిగా ఆమె మాటల మాయలో పడిపోయిన అతడు ఏం చెబితే అది చేయసాగాడు. ఈ క్రమంలోనే వీడియో కాల్ చేసిన యువతి ఇద్దరం న్యూడ్ గా మారి ముచ్చటిద్దామని కోరింది. మొదట యువతి న్యూడ్ గా మారడంతో రాజేష్ కూడా ఏమాత్ర ఆలస్యం చేయకుండా నగ్నంగా ఆమెతో ముచ్చటించాడు. 

read more  మత్తెక్కించే మాటలతో రెచ్చగొట్టి న్యూడ్ వీడియో కాల్... ఆ తర్వాతే అసలు ట్విస్ట్

ఈ nude video call ను రికార్డ్ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. అప్పటివరకు మాయమాటలతో మభ్యపెట్టిన యువతి తన అసలురూపాన్ని బయటపెట్టింది. నగ్నంగా మాట్లాడిన వీడియోను చూపించి రాజేష్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది.  

మొదట ఆమె బెదిరింపులకు భయపడిన రాజేష్ కొంతసొమ్మును ముట్టజెప్పాడు. అయినప్పటికి యువతి వేధింపులు ఆగకపోవడంతో ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు. తన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతి బెదిరిస్తోందంటూ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా స్నేహాలతో చాలామంది యువతీ యువకులు మోసపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ప్రతిరోజూ బయటపడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల కదలికను గమనిస్తూ వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారు చెడు మార్గంలోకి వెళ్ళకుండా ముందుగానే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. 

read more  న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్... సైబర్ ఛీటర్ వలలో హైదరబాదీ

ఇటీవల హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. నగరంలోని హిమాయత్ నగర్ కు చెందిన యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు lady voiceతో మాట్లాడాడు. అమ్మాయిలా మాట్లాడుతూ యువకుడిని రెచ్చగొట్టి న్యూడ్ గా వీడియో కాల్ చేసేలా చేసాడు. ఆ వీడియో రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ ప్రారంభించాడు. 

డబ్బులు ఇవ్వకపోతే నీ nude videoను వాట్స్అప్ గ్రూపులో షేర్ చేయడంతోపాటు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా ఈ యువకుడు పలు దఫాలుగా ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు పంపాడు.  ఎన్ని డబ్బులిచ్చినా బెదిరింపులు ఆగకుండా మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios