Asianet News TeluguAsianet News Telugu

కిడారి, సోమ హత్య: ఒక్క రోజు ముందే వచ్చిన మావోయిస్టులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు  హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు  పోలీసులు ప్రకటించారు.

four held for araku mla kidari sarveswara rao murder case
Author
Visakhapatnam, First Published Oct 14, 2018, 4:46 PM IST

అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు  హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు  పోలీసులు ప్రకటించారు.

ఆదివారం నాడు  విశాఖలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఎస్పీ  ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ ఘటనలో ఏదెల సుబ్బారావు, ఆయన భార్య ఈశ్వరీ, శోభన్,కొర్రామల అనే నలుగురు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే కదలికలను  మావోయిస్టులకు ఇచ్చారని పోలీసులు తెలిపారు.

మావోయిస్టులకు  ఈ నలుగురు సహకరించారని చెప్పారు. భోజనంతో పాటు ఎమ్మెల్యే కదలికలను ఎఫ్పటికప్పుడు  ఇచ్చారని చెప్పారు.రెండు రోజుల ముందే మావోయిస్టులకు సమాచారం అందిందని చెప్పారు.సెప్టెంబర్ 22వ తేదీన మావోయిస్టులు లివిటిపుట్టుకు చేరుకొన్నారని చెప్పారు. అయితే  ఎక్కడ మావోలు షెల్టర్ తీసుకొన్నారనే విషయమై ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదన్నారు.

అయితే ఘటనకు ఒక్క రోజు ముందు లివిటిపుట్టుకు చేరుకొన్నారని చెప్పారు. కోరాపుట్ నుండి  మావోలు లివిటిపుట్టుకు చేరుకొన్నారని  పోలీసులు తెలిపారు. లివిటిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోమపై కాల్పులు జరిగిన ప్రాంతంలో  సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవన్నారు.  సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను జామర్స్ ను ఉపయోగించారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.

సంబంధిత వార్తలు

కిడారి, సోమ హత్య: ఆపరేషన్‌లో పాల్గొన్న మహిళా నక్సలైట్ కాల్చివేత

తప్పు చేశారు శిక్షించాం.. కిడారి హత్యపై మావోల లేఖ..?

కిడారి,సోమ హత్యలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం

కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

 

Follow Us:
Download App:
  • android
  • ios