Asianet News TeluguAsianet News Telugu

తప్పు చేశారు శిక్షించాం.. కిడారి హత్యపై మావోల లేఖ..?

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఎందుకు చంపాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను పేర్కొంటూ మావోయిస్టుల పేరిట విడుదల లేఖ మన్యంలో కలకలం రేపుతోంది.

maoists released open letter for MLA Kidari serveswerarao Murder
Author
Araku, First Published Oct 10, 2018, 7:36 AM IST

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఎందుకు చంపాల్సి వచ్చిందో.. అందుకు గల కారణాలను పేర్కొంటూ మావోయిస్టుల పేరిట విడుదల లేఖ మన్యంలో కలకలం రేపుతోంది.

‘‘ గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులైన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు చేసిన తప్పులకు వారిని గత నెల 23న ప్రజాకోర్టులో శిక్షించాం.. కిడారిని కూడా క్వారీ విషయమై ఎన్నోసార్లు హెచ్చరించాం... అధికార పార్టీకి తొత్తుగా మారి మా హెచ్చరికలను లెక్కచేయలేదు. బాక్సైట్ తవ్వకాల విషయంలోనూ అంతర్గతంగా ప్రభుత్వానికి  సహకరిస్తున్నాడు..

ఎన్నో తప్పులను చేసిన సివేరి సోమను కఠినంగానే శిక్షించాం. సంఘటన రోజు ఆయుధాలతో పోలీసులు చిక్కినా క్షమించి విడిచిపెట్టాం. అదే మా సోదరులు మీకు దొరికితే వాళ్లని నిస్సహాయులను చేసి ఎన్‌కౌంటర్‌ చేసేస్తున్నార’ని లేఖలో పేర్కొన్నారు.

అధికార పార్టీకి అమ్ముడుపోయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరమ్మా.. నీవు మాకు నీతులు చెబుతున్నావా?.. అంటూ లేఖలో ఎద్దేవా చేశారు. నీకు అందిన అవినీతి సొమ్మును రెండు నెలల్లో గిరిజనులకు పంచిపెట్టాలి, లేకుంటే కిడారికి పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చరించారు. అయితే ఈ లేఖ మావోయిస్టులు విడుదల చేసింది కాదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు.

గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను లివిటిపట్టు సమీపంలో మావోలు అడ్డుకున్నారు. వాహనంలోంచి దించి నడిపించుకుంటూ దట్టమైన అటవీప్రాంతంలో వారిద్దరిపై కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

కిడారి,సోమ హత్యలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం

కిడారి హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

మావోల నెక్ట్స్ టార్గెట్..గిడ్డి ఈశ్వరి.. భారీ భద్రత నడుమ పర్యటన

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?
 

Follow Us:
Download App:
  • android
  • ios