అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు వందమంది పైగా విచారించిన అనంతరం పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు.

బంధువులే కిడారికి నమ్మకద్రోహం చేశారని భావిస్తున్నారు.. ఎమ్మెల్యేను ట్రాప్ చేసి.. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటూనే ఆయన అనుపానులు మావోయిస్టులకు చేరవేసినట్లుగా తెలుస్తోంది. కిడారి హత్యకు ముందు.. ఆ తర్వాత ఒక బంధువు కాల్ డేటాను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతను ఓ మండల స్థాయి నాయకుడని సమాచారం. 

గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్లివస్తున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు అడ్డగించి.. ఇద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. 

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?